Daniel Craig: జేమ్స్ బాండ్‌కి బుద్దుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

షార్ప్ లుక్స్, ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ విత్ బ్లూ ఐస్ తో ఉండే డేనియల్ క్రెయిగ్ బాండ్ లందరిలోకి మోస్ట్ హ్యాండ్సమ్ బాండ్ అని పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు.. మిగతా జేమ్స్ బాండ్..

Daniel Craig: జేమ్స్ బాండ్‌కి బుద్దుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Daniel Craig

Daniel Craig: షార్ప్ లుక్స్, ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ విత్ బ్లూ ఐస్ తో ఉండే డేనియల్ క్రెయిగ్ బాండ్ లందరిలోకి మోస్ట్ హ్యాండ్సమ్ బాండ్ అని పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు.. మిగతా జేమ్స్ బాండ్ లందరికంటే ఎక్కువ సినిమాలు చేసి మోడర్న్ జనరేషన్ కి రియల్ బాండ్ అనిపించాడు. మొన్నటి వరకూ మోస్ట్ ఫేవరెట్ అయిన డేనియల్ క్రెయిగ్ సడెన్ గా ఇప్పుడు విలన్ అయిపోయాడు అందరికీ.

Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

జేమ్స్ బాండ్ సిరీస్ లో హీరోలుగా వచ్చిన అందరి కన్నా ఎక్కువ ఫేమ్, నేమ్, క్రేజ్ సంపాదించుకున్నది డేనియల్ క్రెయిగ్. మోడర్న్ బాండ్ గా జేమ్స్ బాండ్ కి ఉండే స్టేచర్ ని ఇంకాస్త ఎలివేట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు 53 ఏళ్ల క్రెయిగ్. జేమ్స్ బాండ్ సిరీస్ లో 25 మూవీ నో టైమ్ టూ డైలో హీరోగా చేసి చివరి బాండ్ గా రిటైర్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ బాండ్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది.

Radhe Shyam: కరోనాతో జాగ్రత్త.. రాధేశ్యామ్ దర్శకుడి ట్వీట్ దుమారం!

దాదాపు 1800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నో టైమ్ టు డై 2021 లోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కలెక్షన్లు సాధించింది. ప్రొఫెషనల్ గా అమేజింగ్ యాక్షన్ స్టంట్స్ తో ఆడియన్స్ ని అలరించి సక్సెస్ అయిన బాండ్ డేనియల్ క్రెయిగ్ కి.. రియల్ లైఫ్ లో హీరోయిజం చూపించిన స్పై ఆఫీసర్లకి ఇచ్చే బ్రిటిష్ హానరరీ కమాండర్ హోదా ఇచ్చి సత్కరించింది బ్రిటీష్ నేవీ.

James Bond : జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి డేనియల్ గుడ్ బై.. కొత్త జేమ్స్ బాండ్ ఎవరు??

బ్రిటిష్ నేవీ ప్రెస్టీజియస్ గా ఇచ్చే ఈ గౌరవాన్ని యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ఓ హీరోకి ఇవ్వడం నాన్సెన్స్ అంటూ సోషల్ మీడియా నెగెటివ్ కామెంట్స్ చేస్తోంది. ఇంత పెద్ద గౌరవాన్ని ఆఫ్ట్రాల్ డబ్బుల కోసం సినిమాల్లో నటించే ఓ హీరోకి ఇచ్చి ఆ కమాండర్ కి ఉన్న గౌరవాన్ని మంటగలిపారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అసలు డేనియల్ కి ఇలాంటి పదవి ఇవ్వడం పెద్ద జోక్ గా అనిపిస్తోందని, ఫ్యాక్ట్ కి ఫిక్షన్ కీ తేడా తెలుసుకోలేనంతగా అధికారులు ఎలా మారిపోయారంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.