James Bond : జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి డేనియల్ గుడ్ బై.. కొత్త జేమ్స్ బాండ్ ఎవరు??

తను బాండ్‌ క్యారెక్టర్‌ లో చివరిగా ఇప్పుడు రాబోతున్న ‘నో టైమ్‌ టు డై’ సినిమాలో నటించాడు, ఈ సినిమా ఈ నెల 30న యూకేతో పాటు ప్రపంచమంతటా విడుదల అవుతుంది. మన తెలుగులో కూడా రిలీజ్‌

James Bond : జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి డేనియల్ గుడ్ బై.. కొత్త జేమ్స్ బాండ్ ఎవరు??

Bond

James Bond :  ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకి మంచి గుర్తింపు ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటికి 24 సినిమాలు వచ్చాయి. 25వ సినిమా రాబోతుంది. ఈ సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పటికి ఏడుగురు హీరోలు జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ని చేశారు. జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ని చేసిన ఏడో హీరో డేనియల్ క్రెయిగ్.

ఈ బ్రిటిష్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌ 2006 కాసినో రాయల్‌లో తొలిసారి బాండ్‌గా కనిపించాడు. ఆ తర్వాత 2008 లో క్వాంటమ్‌ ఆఫ్‌ సోలేస్‌, 2012 లో స్కైఫాల్‌, 2015 లో స్పెక్టర్ సినిమాలలో బాండ్‌గా అలరించాడు. తను బాండ్‌ క్యారెక్టర్‌ లో చివరిగా ఇప్పుడు రాబోతున్న ‘నో టైమ్‌ టు డై’ సినిమాలో నటించాడు, ఈ సినిమా ఈ నెల 30న యూకేతో పాటు ప్రపంచమంతటా విడుదల అవుతుంది. మన తెలుగులో కూడా రిలీజ్‌ కాబోతోంది.

Sonusood : ఇకపై ఈఎన్‌టీ ఆపరేషన్లు ఉచితం: సోనూసూద్

ఈ జేమ్స్ బాండ్ డేనియల్‌ క్రెయిగ్‌ ‘నో టైం టు డై’ సినిమా కంటే ముందే రిటైర్‌ అవ్వాలని అనుకున్నాడట కానీ భారీ రెమ్యునరేషన్‌ కమిట్‌మెంట్‌ కారణంగా ఈ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. క్రెయిగ్‌ రిటైర్‌మెంట్‌ తర్వాత కొత్త జేమ్స్ బాండ్‌ ఎవరనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. అయితే నాన్‌-బ్రిటిష్‌ ఆర్టిస్ట్‌, లేదంటే ఫిమేల్‌ ఓరియెంటెడ్ గా ఫిమేల్ బాండ్‌ను జేమ్స్‌ బాండ్‌ క్యారెక్టర్‌లో నెక్స్ట్ సినిమాతో ఇంట్రడ్యూస్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు నిర్మాణ సంస్థ ఈయోన్‌ ప్రొడక్షన్స్‌ తెలిపింది. నిన్న లండన్‌లో డేనియల్ క్రెయిగ్ చివరి సారిగా బాండ్ గా నటిస్తున్న ‘నో టైం టు డై’ స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్‌ యాక్టర్స్‌ అందరూ వచ్చారు.