Sonusood : ఇకపై ఈఎన్‌టీ ఆపరేషన్లు ఉచితం: సోనూసూద్

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సేవ‌ల‌ను చేసిన సోనూసూద్‌ తాజాగా మరో అడుగు ముందుకేశారు. ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ ద్వారా ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీ సేవలు అందించనున్నట్లు సోనూసూద్‌ తన సోషల్ మీడియా

Sonusood : ఇకపై ఈఎన్‌టీ ఆపరేషన్లు ఉచితం: సోనూసూద్

Sonusood

Sonusood :  కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి సోనూసూద్ సేవా కార్యక్రమాలని చేస్తూనే ఉన్నాడు. కరోనా తర్వాత కూడా తను ఆ సేవా కార్యక్రమాలని ఆపలేదు. సోనూసూద్ ని రోజూ ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా, స్వయంగా కలిసి తమ సమస్యలని వినిపిస్తున్నారు. సోనూసూద్ తనకు వీలైనంత వరకు సహాయం చేస్తూనే వస్తున్నాడు. తన సొంత డబ్బులతో పాటు తనకి విరాళాలుగా వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. రియల్ హీరో అంటూ దేశ ప్రజలంతా సోనూసూద్ ని పొగుడుతున్నారు.

ఇటీవల‌ నటుడు సోనూసూద్ ఇల్లు, కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. సోనూసూద్​ ట్యాక్స్ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు తెలిపారు. దానిపై సోనూసూద్ స్పందిస్తూ.. ప్రతీ భారతీయుడి ప్రార్థనలు ప్రభావం చూపుతాయని, కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం సాగుతుందని అన్నారు. తను పొదుపు చేసే ప్రతీ రూపాయి పేదల విలువైన జీవితాలను కాపాడటానికే అని అన్నారు. దీంతో ప్రజల్లో ఆయనకు ఇంకా మద్దతు పెరిగింది.

Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ ని ఏమని పిలుస్తాడో తెలుసా??

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సేవ‌ల‌ను చేసిన సోనూసూద్‌ తాజాగా మరో అడుగు ముందుకేశారు. ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ ద్వారా ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీ సేవలు అందించనున్నట్లు సోనూసూద్‌ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను దాని వివరాలని కూడా తెలిపారు. దీంతో మరోసారి ప్రజలు సోనూసూద్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలంటే..

ముందుగా www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాలి.
ఆ తర్వాత ఓపెన్‌ అయిన పేజ్‌లో ఉచితంగా అందించే ఈఎన్‌టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి.
ఆ తర్వాత రిజిస్టర్‌ ఆప్షన్‌ లేదా బార్‌కోడ్‌ స్కాన్‌ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫామ్ ఓపెన్‌ అవుతుంది.
అన్ని వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది అని, వివరాలు తెలుసుకొని వాళ్ళే స్పందిస్తారని సోనూసూద్ తెలిపారు.