Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ ని ఏమని పిలుస్తాడో తెలుసా??

అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి కూడా టైం కేటాయిస్తాడు. అప్పుడప్పుడు తన పిల్లలతో, తన భార్యతో గడిపే ఆనంద క్షణాలను

Allu Arjun :  అల్లు అర్జున్ తన వైఫ్ ని ఏమని పిలుస్తాడో తెలుసా??

Snehz

Allu Arjun :  అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి కూడా టైం కేటాయిస్తాడు. అప్పుడప్పుడు తన పిల్లలతో, తన భార్యతో గడిపే ఆనంద క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటాడు. మార్చి 6, 2011న స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు బ‌న్నీ. ఈ దంపతులకు 2014లో ​కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు.

ఈ రోజు అంటే సెప్టెంబర్‌ 29న త‌న శ్రీమ‌తి స్నేహ పుట్టిన రోజు. ప్రతీ సారి తన ఇంట్లో వాళ్ళ పుట్టిన రోజులని బన్నీ ఎంతో ఘనంగా జరిపిస్తాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా శుభాకాంక్షలు తెలియచేస్తాడు. ఇవాళ తన శ్రీమతి పుట్టిన రోజు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. నేను ఇంకా చాలా పుట్టిన రోజులు నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ..’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. అలాగే నిన్న రాత్రి తన భార్యతో కేక్ కట్ చేసి పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేపించారు.

BiggBoss 5 : తనని నా గర్ల్ ఫ్రెండ్ చేయాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్..
ఈ పోస్ట్ చూసి అభిమానులు అల్లు అర్జున్ తన వైఫ్ ని ‘క్యూటీ’ అని పిలుస్తాడని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతోపాటు అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు స్నేహాకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.