BiggBoss 5 : తనని నా గర్ల్ ఫ్రెండ్ చేయాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్..

తాజాగా ఈ సీజన్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ జెస్సి తనకి ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేయమని ఏకంగా బిగ్ బాస్ తో రిక్వెస్ట్ చేసుకున్నాడు.

BiggBoss 5 : తనని నా గర్ల్ ఫ్రెండ్ చేయాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్..

Swtha

BiggBoss 5 :  నాగార్జున హోస్ట్‌ చేస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్ 5 రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా నడుస్తుంది. బిగ్ బాస్ లో ఫ్రెండ్షిప్ ట్రాక్స్ తో పాటు లవ్ ట్రాక్స్ కూడా నడుస్తూ ఉంటాయి. కొంతమంది జెంట్ కంటెస్టెంట్స్, లేడీ కంటెస్టెంట్స్ మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి ట్రాక్స్ ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు బిగ్ బాస్ కి మంచిగానే చెప్పుకుంటారు. ఏమన్నా హెల్ప్ కావలి అంటే రిక్వెస్ట్ చేస్తారు. తాజాగా ఈ సీజన్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ జెస్సి తనకి ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేయమని ఏకంగా బిగ్ బాస్ తో రిక్వెస్ట్ చేసుకున్నాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో జెస్సీ అంటే మిగతా కంటెస్టెంట్స్‌ అందరికి మంచి అభిప్రాయం ఉంది. అందరికి కంటే చిన్నోడు అవ్వడం వల్ల, కొంచెం అమాయకంగా ఉండటం వల్ల అతనికి బానే కలిసొస్తుంది అని చెప్పొచ్చు. కానీ కొన్ని సార్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతన్నాడు. అప్పుడప్పుడు షణ్ముఖ్‌ చెప్పింది జెస్సీ చేస్తున్నాడు. దీనిపై నాగార్జున కూడా జెస్సీకి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి అని సలహా కూడా ఇచ్చాడు.

Rashmika Mandanna : ఫస్ట్ లుక్ తో కుర్రాళ్ళ లుక్స్ ని తిప్పుకున్న నేషనల్ క్రష్..

అయితే కెప్టెన్‌ అయ్యాక జెస్సీ చెప్పే మాటలను కొంతమంది కంటెస్టెంట్స్ పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు జెస్సీకి కోపం కూడా వస్తుంది. ఇటీవల జెస్సి హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ తో మంచి పులిహార కలుపుతున్నాడు. చాన్స్‌ దొరికితే చాలు సిరి, హమిదా, శ్వేతలతో మాట్లాకడటానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళతో ఎక్కువగా క్లోజ్ గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. తన అమాయకత్వంతో వాళ్ళని ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తాజాగా శ్వేతతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. ఈ సారి ఏకంగా శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్‌ పాత్ర ఇచ్చి ఓ టాస్క్‌ఇవ్వడంటూ బిగ్‌బాస్‌తో అన్నాడు. ‘నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా బిగ్‌బాస్‌.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌గా ఒక టాస్క్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’ అనే రొమాంటిక్‌ సాంగ్‌ ప్లే చేయండి’ అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ రిక్వెస్ట్ కి శ్వేత పడిపడి నవ్వింది. మరి ఈ కెప్టెన్ జెస్సి కోరికను బిగ్‌బాస్‌ నెరవేరుస్తాడో లేదో చూడాలి.