Rashmika Mandanna : ఫస్ట్ లుక్ తో కుర్రాళ్ళ లుక్స్ ని తిప్పుకున్న నేషనల్ క్రష్..

తాజాగా ఇవాళ 'పుష్ప' సినిమా నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో రష్మిక

Rashmika Mandanna : ఫస్ట్ లుక్ తో కుర్రాళ్ళ లుక్స్ ని తిప్పుకున్న నేషనల్ క్రష్..

Rashmika

Rashmika Mandanna :  రష్మికకి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. నేషనల్ క్రష్ గా రష్మికకి మంచి హవా నడుస్తుంది. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఇందులో మొదటి సారి గ్రామీణ యువతీ పాత్రలో కనిపించబోతుంది.

ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ అయి భారీ అంచనాలని పెంచాయి. ఇందులో ఇప్పటికే హీరో , విలన్ మరియు కొంత మంది ప్రముఖ పాత్రల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు, ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Pawan Kalyan : మీరు పని చేయకపోతే నేనే రోడ్ల మీదకి వస్తా : పవన్ కళ్యాణ్

తాజాగా ఇవాళ ‘పుష్ప’ సినిమా నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో రష్మిక గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపిస్తోంది. చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఒక మామూలు ఇంట్లో అప్పుడే రెడీ అవుతున్నట్టు తన అందాలను ఆరబోస్తూ ఉంది ఈ ఫస్ట్ లుక్. ఈ ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగింది అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది. దీని బట్టి ఈ సినిమాలో హీరోయినే హీరో వెంట పడుతుందని అర్ధమవుతుంది.