SatyaDev: రాజకీయాలు మాట్లాడితే సినిమాలకే నష్టం.. అన్నీ మూసుకోవడం బెటర్.. సత్యదేవ్ సంచలన కామెంట్స్
రాజకీయాలు మాట్లాడటం కంటే మూసుకొని కూర్చోవడం బెటర్ అంటున్న హీరో సత్యదేవ్(SatyDev).
Hero Satyadev Makes Sensational Comments about Politics
- పొలిటికల్ హీరోలపై సత్యదేవ్ షాకింగ్ కామెంట్స్
- డబ్బు లేకపోతే నోరు మూసుకోవడమే మేలు
- రాజకీయాల వల్ల సినిమా కలెక్షన్స్ నష్టం
SatyaDev: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. నిజానికి, ఈ హీరో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. కానీ, తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో నటీనటులు, రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన, సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను ఎందుకు దాచుకుంటారో ఒక బిజినెస్ మోడల్‌ను ఉదాహరణగా చూపిస్తూ పూసగుచ్చినట్లు వివరించారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నప్పుడు దౌత్యనీతి (Diplomacy) పాటించడం ఒక ప్రోటోకాల్ అని, సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాలనుకున్నప్పుడు నిజాయితీతో కూడిన రాజకీయ అభిప్రాయాలను బయటపెట్టలేమని సత్యదేవ్ (SatyaDev)స్పష్టం చేశారు.
Prabhas Spirit: విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ రచ్చ
సినిమా అనేది ఒక భారీ వ్యాపారమని, థియేటర్లకు వచ్చే పది మంది ప్రేక్షకులలో ఒక్కరిని కూడా రాజకీయాల వల్ల కోల్పోవడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు. ఒకవేళ ఏదైనా ఒక రాజకీయ పార్టీ వైపు నిలబడాలి అనుకుంటే, ఆ తర్వాత వచ్చే నష్టాలను కడిగేసేంత భారీ ఆర్థిక బలం ఉండాలని, లేనప్పుడు నోరు మూసుకుని ఉండటమే మంచిదని వ్యాఖ్యానించారు. సామాజిక అంశాలపై స్పందిస్తే నెటిజన్లు ప్రతి వివాదంలోకి లాగుతూ సెలబ్రిటీలపై ఒత్తిడి పెంచుతున్నారని, అందుకే సినిమా వాళ్లు మౌనంగా ఉండటానికే మొగ్గు చూపుతారని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.
ఇక సత్యదేవ్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘కింగ్డమ్’ చిత్రంతో పాటు ‘డ్రైవ్’, ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్‌లతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ నటిస్తున్న ‘రావు బహదూర్’ (Rao Bahadur) చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు ‘ఫుల్ బాటిల్’, ‘గరుడ: చాప్టర్ వన్’, ‘సమవర్తి’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
