Tecno Phantom X2Pro : టెక్నో ఫాంటమ్ X2 Pro సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేసిందోచ్.. కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Tecno Phantom X2Pro : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో మొబైల్ (Tecno Mobile) నుంచి భారత మార్కెట్లో ఫాంటమ్ X2 సిరీస్ కింద మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

Tecno Phantom X2Pro : టెక్నో ఫాంటమ్ X2 Pro సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేసిందోచ్.. కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Tecno Phantom X2Pro with retractable portrait lens camera, Dimensity 9000 5G SoC launched in India_ price, specs, availability

Tecno Phantom X2Pro : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో మొబైల్ (Tecno Mobile) నుంచి భారత మార్కెట్లో ఫాంటమ్ X2 సిరీస్ కింద మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Tecno Phantom X2 Proగా పిలిచే ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 50వేల లోపు ఉంటుంది. రిట్రాక్టబుల్ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా, స్లిమ్, లైట్ బాడీని కలిగి ఉంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల HD కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 9000 SoC, ఆండ్రాయిడ్ 12 OSపై రన్ అవుతుంది.

భారత్‌లో X2 ప్రో ధర ఎంతంటే? :
టెక్నో Phantom X2 Pro కంపెనీ లాంచ్ చేసిన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. సింగిల్ 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999తో (మూన్‌లైట్ సిల్వర్, స్టార్‌డస్ట్ గ్రే) రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అమెజాన్ (Amazon), రిటైల్ స్టోర్లలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. జనవరి 24న ఈ ఫోన్ లైవ్ సేల్ అవుతుంది.

Tecno Phantom X2Pro with retractable portrait lens camera, Dimensity 9000 5G SoC launched in India_ price, specs, availability

Tecno Phantom X2Pro with retractable portrait lens camera

ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు అదనంగా రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, 12 నెలల అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్‌షిప్, 6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. టెక్నో రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొత్త టెక్నో ఫాంటమ్ X2 ప్రోను కొనుగోలు చేసే మొదటి 600 మంది కస్టమర్‌లకు ఫ్రీగా టెక్నో గిఫ్ట్ హాంపర్, నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తోంది.

Read Also :  iQOO Neo 6 Price Cut : అమెజాన్‌లో ఐక్యూ నియో 6 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Tecno ఫాంటమ్ X2 Pro స్పెసిఫికేషన్స్ :
టెక్నో కొత్త Tecno ఫాంటమ్ X2 ప్రోలో ప్రీమియం ఫీచర్ల రేంజ్ చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.8 అంగుళాల Full HD కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫాంటమ్ X2 Pro Mali-G710 MC10 GPU, హైపర్ ఇంజిన్ 5.0తో MediaTek డైమెన్సిటీ 9000 5G SoC ద్వారా పవర్ అందిస్తుంది.

Tecno Phantom X2Pro with retractable portrait lens camera, Dimensity 9000 5G SoC launched in India_ price, specs, availability

Tecno Phantom X2Pro with retractable portrait lens camera

చిప్‌సెట్ 12GB RAM, 256GB స్టోరేజీతో అదనంగా 5G ఎక్స్‌టెండ్ RAMతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ HiOS 12.0 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆధారంగా Android 12లో రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ USB టైప్-Cతో 5160mAH బ్యాటరీని కలిగి ఉంది.

వెనుకవైపు, ఫాంటమ్ X2 ప్రోలో శాంసంగ్ ISOCELL GNV 3.0 సెన్సార్‌తో 50MP మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సిస్టమ్, మాక్రో షూటర్‌గా 13 MP అల్ట్రావైడ్ యూనిట్, ఫోల్డబుల్ లెన్స్‌తో 50 MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఫోల్డబుల్ ఫీచర్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో హైలైట్ కానుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫాంటమ్ X2 ప్రో పంచ్-హోల్ కటౌట్‌లో 32MP రెస్ట్ కెమెరాను అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?