Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!

ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబో గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి. వీటిలో ఎన్ని నిజమవుతాయో గానీ అభిమానులైతే ఈ వార్తలు విని ఊగిపోతున్నారు. ఈ విషయలో దర్శకులైతే కసిగానే ఉన్నారు.

Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!

Telugu Multi Starrer Films

Telugu Multi Starrer Films: ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబో గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి. వీటిలో ఎన్ని నిజమవుతాయో గానీ అభిమానులైతే ఈ వార్తలు విని ఊగిపోతున్నారు. ఈ విషయలో దర్శకులైతే కసిగానే ఉన్నారు. మల్టీస్టారర్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. ఇద్దరి ఇమేజ్ కి డ్యామేజ్ రాకుండా డైరెక్టర్స్ స్టన్నింగ్ ప్లాన్స్ తో స్క్రిప్ట్ రెడీ చేస్తుండటంతో ఎప్పుడూ ఊహించని కలయికలు సాధ్యమవుతున్నాయి. ఇప్పుడంతా ఎలాగూ మల్టీస్టారర్ హవా నడుస్తుంది కాబట్టి.. వీటిలో కొన్ని ప్రాజెక్ట్స్ పట్టాలెక్కినా ఆశ్చర్యం లేదు.

Krithi Shetty: మెగా డాటర్‌తో కృతి.. అదీ లేడీ ఓరియెంట్ మూవీ!

మెగాహీరోలతో ఆచార్యను తీసుకొస్తున్న కొరటాల శివ ఓ సూపర్ స్ట్రిప్ట్ తో రెడీగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ, మహేశ్ బాబులతో స్క్రీన్ షేర్ చేయించాలనేది కొరటాల ప్లాన్. సూపర్ స్టార్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన బాండింగ్ ఉంది ఈ డైరెక్టర్ కి. సో బాలయ్యతో మహేశ్ కాంబోను వర్కవుట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. బాలకృష్ణతో మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే.. మెగా క్యాంప్ నుంచి ఓ స్టార్ ను తీసుకోవాలనుకుంటున్నారు కొరటాల శివ. ఆ మెగా హీరో ఎవరన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అటు కొరటాలకు, ఇటు బాలయ్యకు ఉన్న షెడ్యూల్ప్రకారం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టేలా ఉంది.

Surrogacy Parents: సరోగసీతో మాతృత్వాన్ని చూస్తున్న బాలీవుడ్!

నిజానికి మహేశ్ సర్కారు వారి పాట తర్వాత కొరటాల సినిమానే చేయాల్సింది. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్.. త్రివిక్రమ్ మూవీకి కమిట్మెంట్ ఇచ్చారు. కానీ ఎక్స్ ఛేంజ్ పాలసీలో భాగంగా కొరటాల-ఎన్టీఆర్ కాంబో, త్రివిక్రమ్-మహేశ్ కాంబో సెట్స్ పైకెళ్తున్నాయి. ఎలాగూ మహేశ్ తో, బాలయ్యతో కొరటాల విడివిడిగా సినిమాలు చేసే ప్లాన్స్ ఉన్నాయి. అయితే తన దగ్గరున్న పవర్ఫుల్ స్క్రిప్ట్ ను ఇద్దరితో వర్కవుట్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు కొరటాల. అదే గనుక నిజమైతే ఓ సూపర్ కాంబో.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని కాంబో సెట్టయినట్టే.

Amala Paul: అమలా పాల్ అందాల దాడి..!

ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మెగాస్టార్. వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. ఇదే ఊపుతో మల్టీస్టారర్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. చిరూతో మరో హీరో కాంబోను సెట్ చేయడానికి డైరెక్టర్స్ పట్టుబట్టిన ఆ ప్రాజెక్ట్స్ డిటేల్స్ పై హావ్ ఎ లుక్.ఫుల్ స్వింగ్ లో సినిమాలను పట్టాలెక్కించేస్తున్నారు మెగాస్టార్. తన సినిమా కోసం అవసరమైతే భారీగానే స్టార్ కాస్ట్ ను వాడుకుంటున్నారు. ఆచార్యలో చరణ్ తో కనిపిస్తూ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు.

Special Songs: స్పెషల్ సాంగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న స్పెషల్ గర్ల్స్..!

గాడ్ ఫాదర్ సినిమాలో చెల్లెలిగా నయన్ ఫిక్సయితే.. సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సత్యదేవ్ కూడా కీ రోల్ చేస్తున్నాడు. ఇక నెక్ట్స్ బాబీ సినిమా కోసం మెగాస్టార్, మాస్ రాజా కాంబో సెట్స్ పైకెళ్తుందని అంటున్నారు. రవితేజతో సూపర్ బాండింగ్ ఉన్న డైరెక్టర్ బాబీ అడగ్గానే చిరూతో మూవీ చేసేందుకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… అలాగే పర్సనల్ గా చిరంజీవి అంటే బాగా ఇష్టపడే రవితేజ.. ఆ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదనే వార్తలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

RRR: అంతా సిద్ధం.. ట్రైలర్ కూడా రెడీ.. ఇక రచ్చ రచ్చే!

చిరూ మరో సినిమా గురించి మరో కాంబో వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మల్టీస్టారర్ ట్రెండ్ ను రీస్టార్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల చిరూ, అల్లు అర్జున్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసారనే గాసిప్స్ బాగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా చిరంజీవికి శ్రీకాంత్అడ్డాల ఓ కథ వినిపించారని… దానికి ఆయన పాజిటివ్ గా స్పందించారని, పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేయన్నారని సమాచారం. ఇందులో మెగాస్టార్ తో పాటూ బన్నీ స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని శ్రీకాంత్అనుకుంటున్నారు. గతంలో డాడీ, శంకర్దాదా జిందాబాద్ సినిమాల్లో అల్లు అర్జున్ తళుక్కున మెరిసారు.

Project K: రెబల్ స్టార్‌తో అశ్విన్ సినిమా.. కీలక మార్పులు చేశారా?

చిరూ – రవితేజ – బాబీ, చిరూ – బన్నీ – శ్రీకాంత్ అడ్డాల, బాలకృష్ణ – మహేశ్ బాబు – కొరటాల శివ… ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్స్ బాగానే ట్రెండ్ అవుతున్నాయి. కానీ… వీటిలో ఎన్ని నిజమవుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏమో గుర్రం ఎగరావచ్చు. అన్నీ నిజమైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే త్వరలో రాబోయే సినిమాలు ఇలాంటి సర్ప్రైజ్ ప్యాకెజ్ లను తీసుకొస్తున్నాయి. తారక్ – చరణ్ ట్రిపుల్ ఆర్, చిరూ – చరణ్ ఆచార్య, పవన్ రానా భీమ్లా నాయక్, నాగ్ – చై బంగార్రాజు, వెంకీ – వరుణ్ ఎఫ్3… ఇలా మాక్సిమమ్ సినిమాలన్నీ క్రేజీ మల్టీస్టారర్లే. సో ఇప్పుడు దేన్నీ తేలికగా తీసిపారేయలేము.