Special Songs: స్పెషల్ సాంగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న స్పెషల్ గర్ల్స్..!

సెట్స్ పై ఉన్న మాక్సిమమ్ సినిమాల్లో ఊర్రూతలూగించే ఐటమ్ సాంగ్ ఒకటి రెడీ అవుతోంది. ఆ కిర్రాక్ పాటల్లో మస్త్ డాన్స్ చేయడానికి ముద్దుగుమ్మలు కొందరు మేమున్నామంటున్నారు. పుష్పలో..

Special Songs: స్పెషల్ సాంగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న స్పెషల్ గర్ల్స్..!
ad

Special Songs: సెట్స్ పై ఉన్న మాక్సిమమ్ సినిమాల్లో ఊర్రూతలూగించే ఐటమ్ సాంగ్ ఒకటి రెడీ అవుతోంది. ఆ కిర్రాక్ పాటల్లో మస్త్ డాన్స్ చేయడానికి ముద్దుగుమ్మలు కొందరు మేమున్నామంటున్నారు. పుష్పలో ఆల్రెడీ సామ్ ఫిక్సయినట్టుగా మరికొంతమంది కూడా స్పెషల్ చిందులేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐటమ్ భామలుగా మారేందుకు ముందుకొస్తున్నారు అందాల హీరోయిన్లు. ఒక్క పాట అంటూ వచ్చిన క్రేజీ ఆఫర్ ను వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు.

Most Eligible Bachelor : ‘ఆహా’ లో అదరగొడుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..

రీసెంట్ గా ఇలాగే పుష్పలో స్పెషల్ నంబర్ చేస్తున్నట్టు ప్రకటించింది సమంతా. బన్నీ-సుకుమార్-దేవీశ్రీప్రసాద్ కలిస్తే ఎలాంటి బంపర్ సాంగ్ బయటికొస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడాలాంటి హాట్ సాంగ్ లో చిందులేయబోతుంది సామ్. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా ఓ సినిమా కోసం వర్క్ చేయబోతుంది ఈ హీరోయిన్. అయితే కనిపించేంది పుష్పలోని ఒక్క పాటలో అయినా రెమ్యూనరేషన్ బాగానే అందుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.

IPL Movie : సిద్ శ్రీరామ్-సునీతల సెన్సేషనల్ సాంగ్..

2022 జనవరిలోనే వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బంగార్రాజు. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి వంటి సూపర్ కాస్టింగ్ ఉన్న ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. గతంలో సోగ్గాడే చిన్ని నాయనాలో అనసూయతో పాటూ మరికొందరు స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఇప్పుడు బంగార్రాజులో మెరిపించేందుకు ఫరియా అబ్దుల్లా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఫరియా నిజానికి మంచి డాన్సర్. జాతిరత్నాలు మూవీలో ఆమెకు ఆ స్కోప్ రాలేదు. కానీ ఇప్పుడు నాగ్ తో కలిసి రచ్చ రచ్చ చేయబోతుంది ఫరియా అబ్దుల్లా.

Project K: రెబల్ స్టార్‌తో అశ్విన్ సినిమా.. కీలక మార్పులు చేశారా?

ఓ అల్ట్రా ఐటమ్ సాంగ్ లేనిది జనరల్ గా రవితేజ సినిమాలు రావు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ధమాకా కోసం కూడా అలాంటి ట్రెండీ సాంగ్ ను రెడీ చేస్తున్నారు మేకర్స్. త్రినాథ రావ్ నక్కిన డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఎంతోమందిని అనుకుని చివరికి ఈశా రెబ్బ దగ్గర ఆగిపోయారు. రవితేజ సరసన ఐటమ్ సాంగ్ చేసేందుకు తెలుగమ్మాయి ఈశారెబ్బ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈశా.. ఈ సూపర్ ఛాన్స్ మిస్ చేసుకోదనే అనుకుంటున్నారు అంతా.

Sara Ali Khan : సాగరతీరాన సోకులారబోస్తున్న సారా

ఇప్పటికే కొన్ని ఐటమ్స్ సాంగ్స్ తో రచ్చ చేసిన తమన్నా కూడా ఆమధ్య గనిలో స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్తలొచ్చాయి. అఫీషియల్ గా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఎఫ్ 3లో వరుణ్ తేజ్ వదినగా నటించిన మిల్కీబ్యూటీ.. గనిలో ఐటమ్ సాంగ్ చేస్తే మాత్రం మెగాఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. వీళ్లే కాదు.. సౌత్ సినిమాల్లో ఐటమ్ నంబర్ చేసేందుకు బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్స్ సినిమాల్లో బంపర్ సాంగ్ ప్లస్ హ్యూజ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుండటంతో కాదనుకుండా వచ్చేస్తున్నారు నార్త్ అందగత్తెలు.

Amitab : పాన్ మసాలా బ్రాండ్‌కు లీగల్ నోటీసులు పంపిన అమితాబ్

ఈమధ్య విక్కీకౌశల్ తో పెళ్లి వార్తల్లో బాగా నానుతుంది కత్రినా కైఫ్. విక్కీతో ఈమె పెళ్లి డిసెంబర్ లోనే అనేలా చాలా సిగ్నల్స్ వస్తున్నాయి. అటు కెరీర్ పరంగా కూడా మంచి పొజిషన్ లోనే ఉంది కత్రినా. లేటెస్ట్ సూర్యవంశీతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఎంట్రీనే సౌత్ నుంచి ఈ హాట్ లేడీ.. ప్రభాస్ తో ఐటమ్ సాంగ్ చేయనుందనే గాసిప్స్ ఆమధ్య బాగా స్ప్రైడయ్యాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ ప్రభాస్ తో కత్రినా హాట్ స్టెప్పులేయనుందని అంటున్నారు.

Allu Arha : అర్హ బర్త్‌‌డే కి స్పెషల్ వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ

హై స్పీడ్ లో మహేశ్ బాబు పూర్తి చేస్తోన్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో సూపర్ స్టార్ డాన్సులు అదిరేలా పై ఓ మస్త్ జబర్దస్త్ సాంగ్ డిజైన్ చేస్తున్నారు పరశురామ్. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలోని ఒక్క పాటలో మాత్రం హాట్ స్టెప్పులుంటాయని అంటున్నారు. ఫస్ట్ మోనాల్ గజ్జర్ పేరు బాగా వినిపించింది కానీ టాలీవు్ ప్రిన్స్ తో స్పెషల్ సాంగ్ చేసేది ఊర్వశీ రౌతేలా అని చెప్తున్నారు. బాలీవుడ్ స్పెషల్ గర్ల్ గా పేరుతెచ్చుకున్న ఊర్వశీ.. మహేశ్ తో డాన్స్ చేస్తే ఫ్యాన్స్ కి పండగే.

Bigg Boss 5 Telugu : అనీ మాస్టర్ ఎలిమినేషన్!

తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ సొనాలీ చౌహాన్. బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఈ భామకు ఎఫ్ 3లో ఛాన్స్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. చిన్న క్యారెక్టర్ తో పాటూ ఓ సూపర్ ఐటమ్ సాంగ్ లో ఊర్వశి కనిపించబోతుంది. ఎఫ్2 మూవీలో వెంకీ, వరుణ్ లతో కలిసి అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తే.. ఫన్ డోస్ పెంచి తెరకెక్కిస్తోన్న ఎఫ్ 3లో సోనాలీ చౌహాన్ అదరగొట్టబోతుంది.