Aha : ఆహా ఉగాది స్పెషల్ ఆఫర్.. 99 రూపాయలకే..
ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో ఆహాకి మంచి ప్రజాదారణ ఏర్పడింది. ఇటీవల ఆహా ప్రేక్షకుల్లోకి మరింత వెళ్లాలని ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. మార్చ్ నెల మొదట్లో మహా మార్చ్ అంటూ..................

Telugu OTT Aha announce special Ugadi offer 99 rupees only for 3 months plan
Aha : తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సీరియల్స్, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. ఇక ఆహా సొంతంగా కొత్త సినిమాలు చాలానే రిలీజ్ చేస్తుంది. ఒక్కో జోనర్ లో ఒక్కో సినిమా అన్నట్టు రకరకాల సరికొత్త సినిమాలు ఆహాలో ఇటీవల వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి.
ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో ఆహాకి మంచి ప్రజాదారణ ఏర్పడింది. ఇటీవల ఆహా ప్రేక్షకుల్లోకి మరింత వెళ్లాలని ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. మార్చ్ నెల మొదట్లో మహా మార్చ్ అంటూ 399 రూపాయల ఆహా ఇయర్ ప్లాన్ ను కేవలం 299 రూపాయలకే అందిస్తుంది. ఈ ఆఫర్ మార్చ్ నెల అంతా ఉండబోతుంది. తాజాగా ఉగాది కానుకగా మరో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది ఆహా. మూడు నెలల 199 రూపాయల ప్లాన్ ను ఇప్పుడు కేవలం 99 రూపాయలకే అందివ్వనుంది. ఇది ఉగాది స్పెషల్ ఆఫర్ గా ప్రకటించడంతో ఉగాది వరకే ఈ ఆఫర్ ఉండొచ్చు కాబట్టి త్వరగా మీరు కూడా ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకొని బోలెడంత ఎంటర్టైన్మెంట్ ని పొందండి.
ఇక ప్రస్తుతం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సందడి చేస్తోంది. బాలకృష్ణతో గాలా విత్ బాల అని స్పెషల్ ఎపిసోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది.
3 month subscription now at just 99/-
తెలుగు నూతన సంవత్సరం అయ్యింది మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా !#ugadi #ugadi2023 #TeluguIndianidol2 #UnstoppableWithNBKS2 #VBVKOnAHA #DJTilluOnAHA #NewsenseOnAHA #MichaelOnAHA pic.twitter.com/cPgssk4CMr— ahavideoin (@ahavideoIN) March 17, 2023