Telugu Star Heroes: బాలీవుడ్‌కు తారక్-బన్నీ.. హాలీవుడ్‌కు ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్స్ పై హాట్ హాట్ గాసిప్స్ ట్రెండ్ అవుతున్నాయి. హాలీవుడ్ సూపర్ మ్యాన్ సిరీస్ లో ప్రభాస్ పేరు వినపిస్తుంటే.. బాలీవుడ్ ప్రిస్టీజియస్ బ్యానర్ తో కలిపి తారక్, బన్నీ..

Telugu Star Heroes: బాలీవుడ్‌కు తారక్-బన్నీ.. హాలీవుడ్‌కు ప్రభాస్!

Telugu Star Heroes

Telugu Star Heroes: పాన్ ఇండియా స్టార్స్ పై హాట్ హాట్ గాసిప్స్ ట్రెండ్ అవుతున్నాయి. హాలీవుడ్ సూపర్ మ్యాన్ సిరీస్ లో ప్రభాస్ పేరు వినపిస్తుంటే.. బాలీవుడ్ ప్రిస్టీజియస్ బ్యానర్ తో కలిపి తారక్, బన్నీ పేర్లు వైరలవుతున్నాయి. వచ్చిన క్రేజీ ఆఫర్స్ కి మన టాలీవుడ్ స్టార్స్ కూడా పాజిటివ్ నోట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఇంతకీ భారీ ఆఫర్స్ ఇచ్చిందెవరు..? వచ్చిందెవరికి..?

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో హాలీవుడ్ నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏషియన్ కంట్రీస్ నుంచి ఫేమస్ స్టార్ ని సెలెక్ట్ చేసుకొని.. ఆయనతో ఏషియన్ సూపర్ హీరో కాన్పెప్ట్ తో సిరీస్ చేయాలనేది యూనివర్సిల్ స్టూడియోస్ ప్లాన్. అందుకే సలార్, ప్రాజెక్ట్, ఆదిపురుష్ వంటి భారీ సినిమాలు చేస్తోన్న ప్రభాస్ ను ఆ సంస్థ సెట్ చేసినట్టు చెప్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో టు రౌండ్స్ మీటింగ్స్ కూడా పూర్తయ్యాయని అమౌంట్ ను భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. డార్లింగ్ కూడా యూనివర్సల్ స్టూడియోస్ ప్రతిపాదనకు సుముఖుంగానే ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

ట్రిపుల్ ఆర్ తో తారక్.. పుష్పతో బన్నీకి నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ దక్కింది. ఇంకేముంది ఆల్రెడీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న రామ్ చరణ్ ను ప్రస్తుతానికి వదిలేసి… తారక్, అల్లు అర్జున్ వెంట పడుతున్నాడు కరణ్ జోహార్. ధర్మ ప్రొడక్షన్స్ లో తారక్, బన్నీతో విడివిడిగా సినిమాలు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో లైగర్ ను పూర్తి చేస్తోన్న కరణ్.. ఇప్పుడీ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ తో.. మెగా డైరెక్టర్స్ ను సెట్ చేసే పనిలో ఉన్నట్టు ముంబై టాక్.