Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ కి వెళ్లిపోవడంతో.. బాలీవుడ్ లో కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. స్పెషల్లీ ఈమధ్య పాన్ ఇండియా సినిమాలతో..

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

Telugu Star Heroes

Telugu Star Heroes: టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ కి వెళ్లిపోవడంతో.. బాలీవుడ్ లో కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. స్పెషల్లీ ఈమధ్య పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ లో తమ క్రేజ్ తో పాటు కలెక్షన్ల స్టామినా కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ హీరోలు. బాలీవుడ్ లో ఒకప్పుడు టాలీవుడ్ హీరోల్ని పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. అందుకే తెలుగు హీరోలు కూడా రిస్క్ ఎందుకుని పెద్దగా అక్కడ సినిమాలు రిలీజ్ చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో రూల్ మారింది.. రూలింగ్ మారింది. అందుకే.. తెలుగు హీరోలు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా పుష్ప హవాతో అందరూ టాలీవుడ్ హీరోల వైపు చూస్తున్నారు.

Bangarraju: ఓటీటీలో బంగార్రాజు.. ఎప్పుడంటే?

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో రిలీజ్ అయిన పుష్ప మూవీ సౌత్ లో సూపర్ హిట్ అవ్వడం పెద్ద విషయం కాదు.. పాన్ ఇండియా లెవల్ లో ఫస్ట్ సినిమాగా వచ్చి.. బాలీవుడ్ లో 100కోట్ల కలెక్షన్లు సాధించారు బన్నీ. ఆల్రెడీ సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న బన్నీకి.. హిందీ డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. దాంతో ఈ క్రేజ్ ని ప్యాన్ ఇండియా లెవల్లో క్యాష్ చేసుకున్నారు బన్నీ. బన్నీ సినిమాలు ఎప్పటి నుంచో బాలీవుడ్ లో డబ్బింగ్ అవుతూ యూట్యూబ్ లో కూడా రికార్డ్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.

Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

2016లో సరైనోడు డబ్బింగ్ సినిమా బాహుబలి కంటే హయ్యస్ట్ టీఆర్పీ స్ సాధించింది. 2021 వరకూ బన్నీ సరైనోడు టీఆర్పీస్ ని ఏ సినిమా క్రాస్ చెయ్యలేకపోయింది. అంతేకాదు.. బన్నీ సినిమాలు యూ ట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాయి. 40 కోట్ల ప్లస్ వ్యూస్ తో డిజె మూవీ, 35కోట్ల వ్యూస్ తో సరైనోడు, సన్నాఫ్ సత్యమర్తి 20 కోట్ల వ్యూస్ తో రేస్ గుర్రం, జులాయి సినిమాలు యూట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేశాయి.

Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

బన్నీ పుష్ప మూవీ హిందీ వర్షన్ 1600 స్క్రీన్స్ లో డిసెంబర్ 24 న రిలీజ్ అయ్యింది. 83రిలీజ్ తో 1400 ధియేటర్లకి తగ్గినా.. ఇప్పటికీ 1000 థియేటర్లలో పుష్ప సినిమా రన్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ అయ్యినా ఇంకా పుష్ప మ్యానియా ఎక్కడా తగ్గలేదు. అల్లు అర్జున్ పెద్ద స్టార్ అని తెలిసినా.. ఓటీటీలో సినిమా రిలీజ్ అయినా కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయేంత క్రేజ్ ఉండడంతొ సర్ ప్రైజ్ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్ .

Tollywood Mega Meeting: సీఎంతో స్టార్స్ భేటీ.. మోహన్ బాబు ఎందుకు మిస్సయ్యారు?

బాహుబలి నుంచే రీజనల్, పాన్ ఇండియా అన్న లైన్ చెరిగిపోయింది. బాహుబలి, సాహో లాంటి మెగా బడ్జెట్ మూవీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయిన ప్రభాస్.. అప్పటి నుంచేబాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ డైరెక్టర్లు హీరోయిన్లు కూడా ప్రభాస్ తో సినిమా చెయ్యలనేంత క్రేజ్ సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రజెంట్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో బాలీవుడ్ మార్కెట్ ని స్ట్రెన్తెన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పాన్ ఇండియా స్టార్.

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

కలెక్షన్లతో కాదు క్రేజ్ తో బాలీవుడ్ జనాల మనసుదోచుకున్న మరో హీరో విజయ్ దేవరకొండ. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అంటూ బాలీవుడ్ ని తన క్రేజ్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఈరౌడీ హీరో. దాదాపు 15, 20 ఏళ్ల కెరీర్ ఉన్న స్టార్ హీరోలు కూడా సంపాదించలేనంత బాలీవుడ్ క్రేజ్ ని ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఈ క్రేజ్ కి ముచ్చట పడి.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ రౌడీ హీరో తో లైగర్ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు.. ఆలియా భట్, జాన్వి కపూర్, సారా అలీఖాన్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా విజయ్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.