Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో పదిమంది.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

బిగ్ బాస్ ఇంట్లో ఐదు వారాలు పూర్తయి ఆరవ వారంలో కూడా ఎలిమినేషన్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మండే అంటే బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ డే కావడంతో ఈ వారం కూడా వాడీవేడిగా ఈ నామినేషన్ల..

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో పదిమంది.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ ఇంట్లో ఐదు వారాలు పూర్తయి ఆరవ వారంలో కూడా ఎలిమినేషన్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మండే అంటే బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ డే కావడంతో ఈ వారం కూడా వాడీవేడిగా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద ఇంటి నుండి బయటకి వచ్చేయగా ఈ వారానికి గాను నామినేషన్స్ లో పదిమందిని నామినేట్ చేశారు. ఆదివారం హమీద ఇంటి నుండి బయటకి రావడంతో ఇంట్లో శ్రీరామ్ లో ఆ లోటు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అర్ధరాత్రి నిద్రలో కూడా ఏవేవో కేకలు వేస్తున్నాడు.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

ఇక ఆరోవారం నామినేషన్స్‌ లో ఇంటి సభ్యులలో ఒకరిపై మరొకరికి నిప్పులా ఎగసిపడుతున్న అభిప్రాయాలను అగ్నిపరీక్ష టాస్క్‌లో బయటపెట్టాలన్న బిగ్‌బాస్‌ ఆదేశాలతో ఒక్కసారిగా ఇంట్లో అలజడి రేగింది. ఇందులో మొదటగా సన్నీ.. రవి, జెస్సీ, విశ్వ.. యానీ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌ను, శ్వేత.. సిరి, కాజల్‌, లోబో.. ప్రియాంక సింగ్‌, జెస్సీని, సిరి.. శ్రీరామచంద్ర, శ్వేత ఫొటోను మంటల్లో వేయగా.. యాంకర్‌ రవి.. మానస్‌, సిరిని, జెస్సీ.. శ్రీరామ్‌, సన్నీని, ప్రియాంక సింగ్‌.. లోబో, విశ్వ , మానస్‌.. యాంకర్‌ రవి, లోబోను, యానీ మాస్టర్‌.. షణ్ముఖ్‌, విశ్వను, శ్రీరామ్‌.. సిరి, షణ్ముఖ్‌, కాజల్‌.. శ్వేత ఫొటోను, ప్రియ.. విశ్వ, సన్నీ ఫొటోలను మంటల్లో వేసింది.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

మొత్తంగా ఈ వారం పదిమంది నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 14 మందిలోనే పదిమంది నామినేషన్ లో ఉండడంతో ఈ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది. షణ్ముఖ్‌, ప్రియాంక సింగ్‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ కాగా అందులో ఐదుగురి మధ్య నువ్వా నేనా అన్నట్లు టైటిల్ పోరు సాగనుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం షో ఎలా నడవనుందన్నది ఆసక్తిగా మారింది. లేదు లేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీలతో ఎదురు వాళ్ళని కార్నర్ చేయాలని చూస్తుండగా సోమవారం అలాంటి వారినే నామినేట్ చేసి వారిపై ఉన్న పగతీర్చుకున్నట్లే ఉంది మిగతా కంటెస్టెంట్లు.