Thaman : ‘రాధేశ్యామ్’ ట్రోలింగ్‌పై కౌంటర్ ఇచ్చిన తమన్

తాజాగా ఈ నెగెటివిటీపై సంగీత దర్శకుడు తమన్‌ స్పందించాడు. తమన్ ఈ సినిమాకి కూడా BGM అందించిన సంగతి తెలిసిందే. సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న ఓ మీమ్‌ను తన ట్విటర్‌లో....

Thaman : ‘రాధేశ్యామ్’ ట్రోలింగ్‌పై కౌంటర్ ఇచ్చిన తమన్

Thaman

Radheshyam :  దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ప్రభాస్‌ నుంచి రిలీజైన సినిమా ‘రాధేశ్యామ్’. అందులోనూ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ తో భారీ అంచనాలు పెరిగాయి. నిన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ పీరియాడికల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. రాధేశ్యామ్ సినిమా అద్భుతమైన ప్రేమకథ, విజువల్స్ అదిరిపోయాయి అంటూ పొగుడుతుంటే కొందరు మాత్రం చాలా స్లోగా సాగుతూ బోర్‌ కొట్టిందని అంటున్నారు. సోషల్ మీడియాలో రాధేశ్యామ్ పై కొంతమంది నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు.

 

తాజాగా ఈ నెగెటివిటీపై సంగీత దర్శకుడు తమన్‌ స్పందించాడు. తమన్ ఈ సినిమాకి కూడా BGM అందించిన సంగతి తెలిసిందే. సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న ఓ మీమ్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు తమన్. ఆ మీమ్‌లో.. ‘సినిమా ఎలా ఉంది?’ అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని, లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌లో ఫస్ట్‌ నైట్‌, సెకండాఫ్‌లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?’ అని తిడుతున్నట్టు ఉంటుంది.

Valimai: ఓటీటీలో అజిత్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మీమ్ ని షేర్‌ చేసిన తమన్‌.. ‘మీమ్‌ అదిరింది.. స్లో అంట, నువ్వు పరిగెత్తాల్సింది’ అంటూ ట్రోలర్స్‌పై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు బ్లాక్‌బస్టర్‌ రాధేశ్యామ్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి అంటున్నారు సినీ వర్గాలు.