Valimai: ఓటీటీలో అజిత్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో దర్శకుడు హెచ్.వినోద్‌ తెరకెక్కించిన సినిమా ‘వలిమై’. అజిత్ నటించిన 60వ సినిమా ఇది కాగా.. టాలీవుడ్ యంగ్ హీరో..

Valimai: ఓటీటీలో అజిత్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Valimai

Valimai: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో దర్శకుడు హెచ్.వినోద్‌ తెరకెక్కించిన సినిమా ‘వలిమై’. అజిత్ నటించిన 60వ సినిమా ఇది కాగా.. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నెగటివ్ రోల్ లో నటించాడు. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్ చేయడం మరో అట్రాక్షన్ కాగా.. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ తమిళనాట రికార్డు వసూళ్లను రాబట్టింది.

Valimai: రూ.100 కోట్ల క్లబ్‌లో వలిమై.. ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్న అజిత్

సినిమాలో కథ ఎలా ఉన్నా.. స్టైలిష్ అండ్ ఇంటిలిజెంట్ కాప్ క్యారెక్టర్‌లో అజిత్ మరోసారి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. బేసిక్‌గా రైడర్ అయిన అజిత్.. బైకులతో బీభత్సంగా ఆడేసుకున్నారు. దీంతో ఉత్తరాదిన కూడా ఈ సినిమాకి కొంత బెటర్ వసూళ్లే దక్కాయి. ఫైనల్ గా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి మన ఇండియా సినిమా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వలిమై రికార్డ్ సెట్ చేసింది.

Valimai: ఆయన వేగాన్ని అందుకోవటం కష్టం.. అజిత్‌పై యంగ్ హీరో కామెంట్స్!

కాగా, ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీలో టాక్ ప్రకారం మార్చి 25 నుంచి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ కి రానున్నట్టు తెలుస్తుంది. జీ 5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందట. అయితే అన్ని భాషల్లోని ఒకేసారి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో పుష్పను కూడా ఇలానే ప్రాంతాల వారీగా ఒక్కో తేదీలలో స్ట్రీమింగ్ చేయగా.. వలిమై కూడా తమిళంలో కొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.