Valimai: రూ.100 కోట్ల క్లబ్‌లో వలిమై.. ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్న అజిత్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన సినిమా ‘వలిమై’. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న రిలీజైన వలిమై సినిమా

Valimai: రూ.100 కోట్ల క్లబ్‌లో వలిమై.. ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్న అజిత్

Valimai: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన సినిమా ‘వలిమై’. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న రిలీజైన వలిమై సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కరోనా తర్వాత వందకోట్లు కొల్లగొట్టిన తొలి తమిళ్ సినిమాగా కోలీవుడ్ కు బూస్టప్ ఇచ్చింది వలిమై. తమిళంలో మినహా మిగతా బాషలలో వలిమై ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని ప్రచారం జరుగుతుంది.

Valimai: ఆయన వేగాన్ని అందుకోవటం కష్టం.. అజిత్‌పై యంగ్ హీరో కామెంట్స్!

విలన్ గా తెలుగు యంగ్ హీరో కార్తికేయ నటించినా తెలుగులో కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా మొత్తం యాక్షన్ తో నింపడంతో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని రిలీజ్ రోజే విశ్లేషకులు చెప్పారు. అయితే.. లాంగ్ రన్ లో మెల్లగా యాక్షన్ సినిమాకి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఇక తమిళనాడులో అయితే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. కరోనా తర్వాత థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పడింది ఈ సినిమాకే.

Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!

కాగా.. తొలి మూడు రోజుల్లోనే ఇక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ వలిమైతో పలు చోట్ల ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమాను బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.