Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు..

తాజాగా తను కంపోజ్​ చేసిన కళావతి సాంగ్ కు తమన్ స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్​ మాస్టర్​తో కలిసి మహేష్ చేసిన స్టెప్పులని దించేసాడు. తమన్........

Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు..

Taman

 

Thaman :  మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తను మ్యూజిక్ ఇచ్చిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతుంది. తను BGM ఇచ్చిన ప్రతి సినిమా భారీ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం తమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలలో మహేష్ బాబు నటింస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఒకటి. ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది.

‘కళావతి’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ అందర్నీ మెప్పిస్తుంది. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదలైన ఈ ఫస్ట్​ లిరికల్​ సాంగ్ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో వెళ్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలైన ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఇందులో మహేష్ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక అప్పట్నుంచి ఈ పాటతో పాటు మహేష్ స్టెప్పులు వేస్తూ రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రేక్షకులు, నెటిజన్లతో పాటు స్టార్స్ సైతం కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇటీవలే మహేష్ కూతురు సితార, హీరోయిన్ కీర్తి సురేష్ లు కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి దుమ్ము దులిపేశారు.

Vikramaditya : పీరియాడిక్ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ తేజ

తాజాగా తను కంపోజ్​ చేసిన కళావతి సాంగ్ కు తమన్ స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్​ మాస్టర్​తో కలిసి మహేష్ చేసిన స్టెప్పులని దించేసాడు. తమన్ కళావతి సాంగ్ కి డ్యాన్స్ చేసి ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇన్నాళ్లు సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కనపడిన తమన్ ఇలా స్టెప్పులు వేసేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు. మహేష్ అభిమానులు అయితే తమన్ ని పొగిడేస్తున్నారు. తమన్ వేసిన ఈ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.