Vikramaditya : పీరియాడిక్ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ తేజ

తేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. 1836వ సంవత్సరంలో సాగే ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీతో ‘విక్రమాదిత్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తేజ పుట్టిన రోజు సందర్భంగా.....

Vikramaditya : పీరియాడిక్ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ తేజ

Teja

Vikramaditya :   సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు తేజ. ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త వాళ్ళని పరిచయం చేశాడు. ఒకప్పుడు లవ్, రా, రస్టిక్ సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. ఇటీవల తన పద్ధతి వదిలేసి కమర్షియల్ ఫార్మేట్ లోకి రావడంతో పరాజయాలు మూట కట్టుకున్నాడు. అందుకే మళ్ళీ తన పాత పంథాలోకి వెళ్లి సినిమాలు తీయాలి అనుకుంటున్నాడు తేజ.

నిన్న మంగళవారం డైరెక్టర్ తేజ పుట్టినరోజు కావడంతో తన నెక్స్ట్ సినిమాలని అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తన పాత పద్దతిలో ‘అహింస’ అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీంతో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు.

Ahimsa

Boney Kapoor : ఎన్టీఆర్‌తో సినిమా అవాస్తవం.. భవిష్యత్తులో జాన్వీ తెలుగులో చేస్తుంది..

తేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. 1836వ సంవత్సరంలో సాగే ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీతో ‘విక్రమాదిత్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తేజ పుట్టిన రోజు సందర్భంగా నిన్న మంగళవారం 2022 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు ఈ సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు తేజ. తేజ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘జయం’ సినిమా షూటింగ్‌ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే ముహూర్తంలో మొదలైంది.

12Th Man: ఓటీటీలో మోహన్ లాల్ సినిమా.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఈ ‘విక్రమాదిత్య’ సినిమాని భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో పొగ వదులుతూ ఒక ట్రైన్ వెళ్తున్నట్టు ఉంది. ఈ స్టోరీ 1836లో జరిగింది అని కూడా పోస్టర్ పై తెలిపారు.