Thaman : త్రివిక్రమ్ గారు లేకపోతే నేను లేను.. నాకు ఈ లైఫ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ.. హైపర్ ఆది బాగా మాట్లాడాడు. నేను మాట్లాడుకున్నది కూడా మాట్లాడేశాడు. సార్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ GV రాలేకపోయాడు, అతని కోసం నేను వచ్చాను................

Thaman : త్రివిక్రమ్ గారు లేకపోతే నేను లేను.. నాకు ఈ లైఫ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు

Thaman speech in Dhanush Sir movie pre release event

Thaman :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 15 సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Sai Kumar : యాక్టర్‌గా నా 50వ సంవత్సరం.. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను.. ధనుష్ IPL మ్యాచెస్ బాగా చూస్తాడు..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ.. హైపర్ ఆది బాగా మాట్లాడాడు. నేను మాట్లాడుకున్నది కూడా మాట్లాడేశాడు. సార్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ GV రాలేకపోయాడు, అతని కోసం నేను వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఈ సినిమాకి కర్చీఫ్ తీసుకెళ్లండి, ఏడుస్తూ వస్తారు థియేటర్లోంచి. సితార ఎంటర్టైన్మెంట్స్ మంచి మంచి సినిమాలు తీస్తుంది. డైరెక్టర్ వెంకీని ఈ సినిమా రిలిజ్ అయ్యాక అందరూ సార్ అనే పిలుస్తారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. త్రివిక్రమ్ సార్ నాకు ఈ స్టేజ్ ఇచ్చారు. నా లైఫ్, క్యారెక్టర్ అంతా త్రివిక్రమ్ సార్ మార్చారు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ నేను ఇలా ఉన్నాను అంటే దానికి త్రివిక్రమ్ గారే కారణం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు.