Sai Kumar : యాక్టర్‌గా నా 50వ సంవత్సరం.. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను.. ధనుష్ IPL మ్యాచెస్ బాగా చూస్తాడు..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. యాక్టర్ గా ఇది నా 50వ సంవత్సరం. గురువుకి ఈ సార్ సినిమా పట్టాభిషేకం చేస్తుంది. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నేను శివాజీ గణేశన్ గారికి పెద్ద ఫ్యాన్...................

Sai Kumar : యాక్టర్‌గా నా 50వ సంవత్సరం.. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను.. ధనుష్ IPL మ్యాచెస్ బాగా చూస్తాడు..

Sai Kumar speech in Dhanush Sir Movie Pre Release Event

Sai Kumar  :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 15 సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Director Venky Atluri : త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. యాక్టర్ గా ఇది నా 50వ సంవత్సరం. గురువుకి ఈ సార్ సినిమా పట్టాభిషేకం చేస్తుంది. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నేను శివాజీ గణేశన్ గారికి పెద్ద ఫ్యాన్. అంతటి నటుడికి ధనుష్ లో చూస్తున్నాను. ధనుష్ IPL మ్యాచెస్ బాగా చూస్తాడు. షూటింగ్ మధ్యలో స్కోర్ అడుగుతుంటాడు. సముద్రఖనితో కలిసి చేయడం ఇదే మొదటి సినిమా. మళ్ళీ మళ్ళీ కలిసి చేస్తున్నాము. చదువుకు సంబంధించిన అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ తో కలిపి ఈ సినిమా ఉండబోతుంది. చిన్నప్పుడు మా అమ్మ నాకు చదువు వ్యాల్యూ గురించి బాగా చెప్పేది. కష్టపడి చదువుకున్నాము. ఎంఫిల్ దాకా చదివాను మద్రాసులో. సినిమా కష్టాలు మా ఇంట్లో ఉన్నా చదువుకున్నాను. ఆ తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశాను మద్రాస్ కాలేజీలో. గురువులు, స్టూడెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు.