Director Venky Atluri : త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు..

సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మౌత్ టాక్ తో సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. కనీసం నెల రోజులు ఈ సినిమా ఆడుతుంది...........

Director Venky Atluri : త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు..

Director Venky Atluri speech in Dhanush sir movie pre release event

Director Venky Atluri :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మౌత్ టాక్ తో సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. కనీసం నెల రోజులు ఈ సినిమా ఆడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత తన లైఫ్ లో సపోర్ట్ చేసిన గురువులందరికి థ్యాంక్స్ చెప్పారు. త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంతకంటే ఏం కావాలి అని అన్నారు.

Dhanush : ధనుష్ కి డబ్బింగ్ చెప్పిన త్రివిక్రమ్.. ఇది మీ అందరి కథ.. తెలుగులో త్రివిక్రమ్ గారు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు..

సినిమా గురించి మాట్లాడుతూ.. చాలా మంచి పాటలు ఇచ్చారు. సినిమా ఎడిట్ టేబుల్ మీదే ప్రాణం పోసుకుంటుంది. ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాని చాలా బాగా కట్ చేశాడు. ధనుష్ గారు ఈ సినిమా ఇచ్చినందుకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సినిమాలోని నాదస్వరం అనే ఓ సంగీత పరికరం గురించి, దాని గురించి ధనుష్ చెప్పిన కథని చెప్పారు. ధనుష్ సార్ కెమెరా ముందు ఉంటే ఎవరూ కనపడరు. GV మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో మాట్లాడతాను మళ్ళీ అని అన్నారు.