Thank You: దిల్ రాజుకు థ్యాంక్యూ చెబుతున్న ఆడియెన్స్.. ఎందుకంటే?

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఈ వారంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తనదైన మార్క్.....

Thank You: దిల్ రాజుకు థ్యాంక్యూ చెబుతున్న ఆడియెన్స్.. ఎందుకంటే?

Thank You Movie Ticket Prices Slashed Down

Thank You: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఈ వారంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Thank You: థ్యాంక్యూ రన్‌టైమ్.. మరీ అంతా..?

అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర యూనిట్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసేలా ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. టికెట్ రేట్లను తగ్గించి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఈ స్థాయిలో టికెట్ రేట్లు తగ్గకపోవడం గమనార్హం.

Thank You Trailer Launch: థ్యాంక్యూ ట్రైలర్ లాంఛ్‌లో సందడి చేసిన స్టార్స్

థ్యాంక్యూ సినిమా టికెట్ రేట్లను తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.100+జీఎస్టీ గా.. మల్టీప్లెక్స్‌లలో రూ.150+జీఎస్టీగా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. సాధారణ టికెట్ రేట్లు కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని చిత్ర యూనిట్ కోరుతోంది. మంచి కంటెంట్, మంచి ఫీలింగ్ ఉన్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసే విధంగా టికెట్ రేట్లను అందుబాటు ధరలో ఉండాలని తాము ఈ విధంగా రేట్లను తగ్గించినట్లుగా దిల్ రాజు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామలు రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.