The Academy : RRR టీంకు మరో అరుదైన గౌరవం.. అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో ఏకంగా RRR నుంచి 6గురు..

తాజాగా ఆస్కార్ సంస్థ అకాడమీ 398 మంది కొత్తవాళ్లను సభ్యులుగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్స్ పంపించింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళే కావడం గమనార్హం.

The Academy : RRR టీంకు మరో అరుదైన గౌరవం.. అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో ఏకంగా RRR నుంచి 6గురు..

The Academy invites 6 persons from RRR Team as Academy members

RRR Movie : మన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయి పేరు, ప్రఖ్యాతలు, కలెక్షన్స్ తో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో RRR టీం అంతా ఒక్కసారిగా ప్రపంచమంతా మరింత పాపులర్ అయ్యారు. ఇక హాలీవుడ్ లో అయితే చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి లని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సినిమా రిలీజయి సంవత్సరం దాటేసినా ఇంకా RRR హవా కొనసాగుతుంది.

తాజాగా RRR టీంకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ సంస్థ అకాడమీలో మెయిన్ కమిటీ కాకుండా దాదాపు 10 వేల మంది సభ్యులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలలోంచి కొంతమందిని అకాడమీ సభ్యులుగా వివిధ కేటగిరీలలో ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కొంతమంది కొత్తవాళ్ళని కూడా అకాడమీలో సభ్యులుగా జాయిన్ అవ్వడానికి ఇన్విటేషన్ పంపిస్తారు.

తాజాగా ఆస్కార్ సంస్థ అకాడమీ 398 మంది కొత్తవాళ్లను సభ్యులుగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్స్ పంపించింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళే కావడం గమనార్హం. యాక్టర్స్ కేటగిరిలో ఎన్టీఆర్, చరణ్, కెమెరా డిపార్ట్మెంట్ లో సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్స్ లో సాబు సిరిల్, మ్యూజిక్ విభాగంలో చంద్రబోస్, కీరవాణి ఉన్నారు. వీరంతా RRR టీం కావడం విశేషం. ఇక నిర్మాతల విభాగంలో కరణ్ జోహార్, డాక్యుమెంటరీ విభాగంలో షౌనక్ సేన్ ఇండియా నుంచి ఉన్నారు.

Kamal Haasan : డైరెక్టర్ శంకర్‌కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. సినిమా రిలీజ్ అవ్వకుండానే..

దీంతో అభిమానులు, నెటిజన్లు RRR టీంకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ లిస్ట్ లో రాజమౌళి లేకపోవడం అందర్నీ నిరాశపరిచింది. వీరందరికి ఆస్కార్ సంస్థ ఇన్విటేషన్స్ పంపించింది. వీరంతా వాటిని యాక్సెప్ట్ చేస్తేనే వీరు అకాడమీ మెంబెర్స్ గా గుర్తించబడతారు. వీరు వచ్చే ఆస్కార్ అవార్డ్స్ లో బరిలో నిలిచిన సినిమాలకు ఓట్లు వేయొచ్చు. అంతే కాక వీరికి మరిన్ని సదుపాయాలు ఉండనున్నాయి.