Kamal Haasan : డైరెక్టర్ శంకర్‌కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. సినిమా రిలీజ్ అవ్వకుండానే..

సాధారణంగా సినిమా సూపర్ హిట్ అయితే డైరెక్టర్స్ కి నిర్మాతలు, హీరోలు ఏదో ఒకటి ఖరీదైన బహుమతులు ఇస్తారు. ఎక్కువగా కార్లు, వాచ్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ శంకర్ కి సినిమా రిలీజ్ అవ్వకుండానే కమల్ హాసన్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు.

Kamal Haasan : డైరెక్టర్ శంకర్‌కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. సినిమా రిలీజ్ అవ్వకుండానే..

Kamal Haasan gifted costly watch to Direct Shankar

Updated On : June 29, 2023 / 11:29 AM IST

Director Shankar  :  డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్(Ram Charan) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తూనే మరో పక్క కమల్ హాసన్(Kamal Haasan) భారతీయుడు 2(Indian 2) సినిమా కూడా చేస్తున్నాడు. చరణ్ షూటింగ్స్ కి గ్యాప్ ఇవ్వడంతో పూర్తిగా భారతీయుడు 2 సినిమాపై ఫోకస్ చేసి చేస్తున్నాడు శంకర్. శంకర్ దర్శకత్వంలోనే గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడుకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఆంధ్ర, తమిళనాడు, రామోజీ ఫిలిం సిటీ, మలేషియా, ఆఫ్రికాలలో ఈ సినిమా షూట్ చేశారు. ప్రస్తుతం భారతీయుడు 2 షూటింగ్ చివరిదశ లో ఉంది.

సాధారణంగా సినిమా సూపర్ హిట్ అయితే డైరెక్టర్స్ కి నిర్మాతలు, హీరోలు ఏదో ఒకటి ఖరీదైన బహుమతులు ఇస్తారు. ఎక్కువగా కార్లు, వాచ్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ శంకర్ కి సినిమా రిలీజ్ అవ్వకుండానే కమల్ హాసన్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. శంకర్ కి ఓ ఖరీదైన వాచ్ ని బహుమతిగా ఇచ్చాడు కమల్ హాసన్. ఆ వాచ్ ని తానే స్వయంగా శంకర్ చేతికి పెట్టాడు. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు కమల్.

Ramayanam Serial : ఆదిపురుష్ ఎఫెక్ట్‌తో.. బాలీవుడ్ సూపర్ హిట్ రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్..

శంకర్ కి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఫోటోని షేర్ చేస్తూ కమల్ తన ట్విట్టర్ లో.. ఇవాళే భారతీయుడు 2 సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూశాను. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా నీ జీవితంలో ఒక ఉన్నత శిఖరంగా నిలిచిపోతుంది. ఇక్కడితో ఆగకుండా నువ్వు మరిన్ని గొప్ప సినిమాలు తీయాలి, నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని శంకర్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.