Ramayanam Serial : ఆదిపురుష్ ఎఫెక్ట్‌తో.. బాలీవుడ్ సూపర్ హిట్ రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్..

రామానంద సాగర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం సీరియల్ తెరకెక్కింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు. 1987 నుంచి 1988 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా అప్పట్లోనే విశేష ప్రజాదరణ దక్కించుకొని లిమ్కా బుక్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించింది.

Ramayanam Serial : ఆదిపురుష్ ఎఫెక్ట్‌తో.. బాలీవుడ్ సూపర్ హిట్ రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్..

Ramanand Sagar Bollywood Ramayanam Serial Re Telecast with Adipurush effect

Adipurush :  ప్రభాస్(Prabhas) రాముడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్ రిలీజ్ రోజు నుంచే దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. రామాయణాన్ని, అందులో పాత్రల స్వరూపాలని, డైలాగ్స్ ని ఇష్టమొచ్చినట్టు మార్చేసి రాయడంతో డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా దారుణంగా ట్రోల్ చేశారు. సినిమా పూర్తిగా వివాదాలమయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో గతంలో బాలీవుడ్ లో వచ్చిన రామాయణం సీరియల్ ని కంపేర్ చేస్తూ అప్పట్లోనే అంత బాగా చేశారు, దానిని చూసి అయినా నేర్చుకోవాల్సింది అంటూ బాలీవుడ్ నెటిజన్లు ఆదిపురుష్ ని ట్రోల్ చేశారు.

రామానంద సాగర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం సీరియల్ తెరకెక్కింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు. 1987 నుంచి 1988 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా అప్పట్లోనే విశేష ప్రజాదరణ దక్కించుకొని లిమ్కా బుక్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించింది. ఆ తర్వాత ఇటీవల కరోనా సమయంలో 2020 నుంచి మరోసారి రీ టెలికాస్ట్ చేయగా అప్పుడు కూడా ఏకంగా 7 కోట్లకు మందికి పైగా వీక్షణలు రావడంతో సరికొత్త రికార్డు సృష్టించింది రామాయణం సీరియల్. ఇప్పుడు ఆదిపురుష్ ఎఫెక్ట్ తో మరోసారి అందరూ ఈ రామాయణం సీరియల్ ని పొగుడుతుండటం, కొంతమంది మళ్ళీ దీన్ని రీ టెలికాస్ట్ చేయమని అడుగుతుండటంతో రీ టెలికాస్ట్ కి సిద్ధమైంది.

Lavi Pajni : మా సినిమా నాకే నచ్చలేదు.. ‘ఆదిపురుష్’పై కుంభకర్ణ పాత్ర చేసిన నటుడు వ్యాఖ్యలు..

బాలీవుడ్ రామాయణం సీరియల్ షెమారూ ఛానల్ లో జులై 3 నుంచి ప్రతి రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయనున్నట్టు తెలుపుతూ ఆ ఛానల్ ఓ ప్రకటన చేసింది. అయితే సోషల్ మీడియాలో దీనిపై పోస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేసింది. దీంతో మరి రీ టెలికాస్ట్ ఉంటుందా, ఉండదా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన ఇప్పటికే వైరల్ అవ్వగా బాలీవుడ్ లో చాలా మంది ఈ రామాయణం సీరియల్ రీ టెలికాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.