The Warrior: ‘ది వారియర్’ ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి....

The Warrior: ‘ది వారియర్’ ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

The Warrior Pre Release Business Report

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో రామ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

The Warrior: సెన్సార్ ముగించుకున్న ది వారియర్

ఇక ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ఈ సినిమాను నార్మల్ టికెట్ రేట్లకే ప్రదర్శిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు జనం ఆసక్తిని చూపుతారని బయ్యర్లు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేశారు.

The Warrior : ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో అని చిత్ర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.45 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏరియాలవారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 11.7 కోట్లు
సీడెడ్ – 6 కోట్లు
వైజాగ్ – 4 కోట్లు
ఈస్ట్ – 2.55 కోట్లు
వెస్ట్ – 2.25 కోట్లు
కృష్ణా – 2.40 కోట్లు
గుంటూరు – 2.70 కోట్లు
నెల్లూరు – 1.30 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ -32.9 కోట్లు
కర్ణాటక – 2.5 కోట్లు
తమిళనాడు – 3.6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 2 కోట్లు
P&P – 3 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 45 కోట్లు