Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!

ఈ ఇయర్ తనదే అంటుంది బుట్టబొమ్మ. ఒకటి రెండు కాదు, ఏకంగా అయిదు సినిమాలు ఈ ఇయర్ లో రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.

Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!

Pooja Hegde

Pooja Hegde: ఈ ఇయర్ తనదే అంటుంది బుట్టబొమ్మ. ఒకటి రెండు కాదు, ఏకంగా అయిదు సినిమాలు ఈ ఇయర్ లో రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఆల్రెడీ హిందీలో సినిమాలు చేసిన పూజాహెగ్డే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారడానికి ట్రై చేస్తుందా? అవుననే అంటున్నారు జిగేలు రాణి అభిమానులు.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

మాస్క్ అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే, తర్వాత రెండు తెలుగు సినిమాలు చేసింది. అయినా ఫ్లాప్ హీరోయిన్ గానే పేరొచ్చింది. దాంతో బాలీవుడ్ లో ఎంటరై భారీ సినిమాలే చేసింది అక్కడా కలసి రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ లోకి మకాం మార్చింది. ఇక్కడ వరుస విజయాలతో లక్కీ గాళ్ గా మారిపోయింది. అందం అభినయం రెండు కలసిన బుట్టబొమ్మ నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ వంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

Mallika Sherawat: వయసు నాలుగు పదులు దాటినా తగ్గని ఘాటు!

పూజా హెగ్డే హీరోయిన్ గా సర్కస్ అనే డైరెక్ట్ హిందీ సినిమా షూటింగ్ పూర్తయింది. జులైలో రిలీజ్ కానుంది. కామెడి జానర్లో్ రానున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రానున్న రాధే శ్యామ్ మార్చి 11న రిలీజ్ కానుంది. తమిళ్ లో బీస్ట్, తెలుగులో ఆచార్య కూడా రిలీజ్ డేట్స్ ఇచ్చేశాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పూజా హెగ్డేకు బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాలి డైరెక్ట్ హందీ సినిమా చేస్తోంది. ఈ సినిమా ఈనెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Ashu Reddy: ఆపని ఫోటో షూట్లు.. అషూ నీకిది తగునా?!

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. ఆ సాంగ్ పూజాహెగ్డేతో చేయించాలనుకుంటున్నారట యానిమల్ టీమ్. ఆ స్పెషల్ సాంగ్ చేయడానికి జిగేలు రాణి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. తెలుగులో మహేశ్ బాబు కాంబినేషన్ లో రానున్న సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు కమిట్ అయిన పూజా హెగ్డే బాలీవుడ్ లో ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. దాంతో తెలుగు సినిమాలిచ్చిన సక్సెస్ కిక్ తో బాలీవుడ్ లో మళ్లీ బిజీ హీరోయిన్ గా మారుతుంది అనుకుంటున్నారు బుట్టబొమ్మ ఫాన్స్.