Khatra (Dangerous): సినిమా వాయిదా కారణం ఇదే.. వర్మ వీడియో!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం డేంజరస్ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు.

Khatra (Dangerous): సినిమా వాయిదా కారణం ఇదే.. వర్మ వీడియో!

Khatra (dangerous)

Khatra (Dangerous): సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం డేంజరస్ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఈ అన్యాయంపై పోరాడుతామని.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తానని వర్మ ప్రకటించారు.

Ram Gopal Varma: కొందరికి రాముడు.. మరికొందరికి రావణుడు!

లెస్బియన్ సినిమా కావడంతో పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ ప్రదర్శనకు తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మరికొన్ని థియేట‌ర్లు కూడా ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందుకు రాలేద‌ట‌. ఈ కార‌ణంగానే చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు వర్మ ప్ర‌క‌టించారు. త‌న‌కూ త‌న చిత్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ‌.. దీనిపై అడ్వకెట్లతో మాట్లాడుతున్నామని.. సినిమా ప్రదర్శనపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

RGV: బోర్ కొట్టేసిన వర్మ కాంట్రవర్సీలు.. డేంజరస్‌కి థియేటర్లెక్కడ?

అసలు ఈ సినిమాను లెస్బియన్ కథగా తీసుకొనేందుకు ప్రేరేపించిందిందే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పని చెప్పిన వర్మ.. అందరి మనుషులలాగానే లెస్బియన్స్ కూడా మనుషులేనని కోర్టు చెప్పిందని.. అందుకే నేను ఈ సినిమా తీశానని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత అందరు వాళ్ళ మీద సింపతీ చూపించేలా తెరకెక్కిస్తే.. నేను సాధారణ సినిమాలలో హీరో-హీరోయిన్ల మాదిరే ఇద్దరు లెస్బియన్లగా సినిమా తీశానని.. మాకున్న అన్ని రీసోర్స్ వాడుకొని.. ఫైట్ చేసి మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తానని వర్మ వీడియో రిలీజ్ చేశారు.