NTR 30: కొరటాల సినిమా కథ ఇదే.. రివీల్ చేసిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పూర్తిచేసుకొని ఫ్యామిలీతో వెకేషన్ లో ఉండగా.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్..

NTR 30: కొరటాల సినిమా కథ ఇదే.. రివీల్ చేసిన తారక్!

#ntr30

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పూర్తిచేసుకొని ఫ్యామిలీతో వెకేషన్ లో ఉండగా.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో కొరటాల సినిమా ముందుగా మొదలు కానుండగా ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల కథనాలు.. భారీ అంచనాలు కూడా పెట్టేసుకున్నారు అభిమానులు. ఈ సినిమా కోసం బాలీవుడ్ భామల ఎంపికలో ఉండగా అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ అరంగేట్రం ఉండొచ్చని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

ఇక, ఈ సినిమా లైన్ కి తారక్ ఎప్పుడో ఒకే చెప్పగా ప్రస్తుతం ఈ సినిమా కోసం బౌండ్ స్క్రిప్ట్ సిద్దమవుతుంది. ఇందు కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు రంగంలోకి దిగగా.. ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. కాగా, ఇప్పటి వరకు ఈ సినిమాపై ఊహాగానాలే కానీ సినిమా యూనిట్ నుండి కానీ మేకర్స్ నుండి కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. అయితే.. ఈ సినిమాపై తొలిసారి ఎన్టీఆర్ నోరు విప్పాడు.

Avika Gor: అందంతో కట్టిపడేస్తున్న అవికా..!

తాజాగా ఓ ప్రముఖ పబ్లికేషన్ తో మాట్లాడిన ఎన్టీఆర్ తన చేయబోయే రెండు ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు. కొరటాల శివతో చేసే సినిమా కంప్లీట్ ఓ రివేంజ్ డ్రామాగా చెప్పిన తారక్.. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని చెప్పాడు. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అక్టోబర్ లో మొదలవుతుందని చెప్పాడు. అయితే.. కొరటాల తన ప్రతి సినిమాకి ఏదోఒక సోషల్ కాజ్ ని మిక్స్ చేయడం అలవాటు. దీంతో ఈ రివెంజ్ డ్రామాకు కొరటాల ఎలాంటి సోషల్ కాజ్ మిక్స్ చేస్తాడోనని అభిమానుల చర్చలు మొదలయ్యాయి.