Puneeth Rajkumar: ఈ బాధ ఎవరికీ రాకూడదు.. శివ రాజ్‌కుమార్‌ ఆవేదన!

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు గడిచినా కన్నడనాట ఇంకా ఆ విషాదం కొనసాగుతూనే ఉంది. పునీత్ ను కడచూపు చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఆ రోజు కంఠీరవ...

Puneeth Rajkumar: ఈ బాధ ఎవరికీ రాకూడదు.. శివ రాజ్‌కుమార్‌ ఆవేదన!

Puneeth Rajkumar

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు గడిచినా కన్నడనాట ఇంకా ఆ విషాదం కొనసాగుతూనే ఉంది. పునీత్ ను కడచూపు చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఆ రోజు కంఠీరవ స్టూడియోకి పోటెత్తగా.. ఇప్పటికీ కొందరు అభిమానులు పునీత్ సమాధిని దర్శించుకొనేందుకు కంఠీరవ స్టూడియో గేట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పునీత్ అభిమాన సంఘాలు ఆ బాధ నుండి తేరుకోనేలేదు. మరోవైపు పునీత్ కుటుంబం కన్నీటి రోదన ఆగడం లేదు.

Puneeth-Pranitha: ప్రణీత ఉదారత.. పునీత్ నివాళిగా మెడికల్ క్యాంప్!

పునీత్ మరణం అనంతరం ఆయన కుటుంబ సభ్యులలో పెద్దన్న శివ రాజ్ కుమార్ తొలిసారి సోమవారం మీడియాతో మాట్లాడారు. పునీత్‌ మరణం మా కుటుంబానికి తీరని శోకం మిగిల్చిందని.. నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధ ఎవరికీ రాకూడదని శివన్న కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్‌కు పాల శాస్త్రం చేయడం ఎంతవరకు సరి అనేది అర్థం కావడం లేదన్న శివరాజ్ కుమార్.. ఒకవేళ పాలశాస్త్రం చేయాల్సి వస్తే.. ఆ తంతు ముగియగానే అభిమానులను కంఠీరవ స్టూడియోలో సమాధి వద్దకు అనుమతించటంపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు.

Puneeth Rajukumar: డబ్బింగ్ లేకుండానే పునీత్ చివరి సినిమా విడుదల!

ఇక, పునీత్ కుటుంబానికి ప్రముఖుల పరామర్శలు ఆగడం లేదు. ప్రముఖ సీనియర్ నటుడు, శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు పునీత్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. తమ తండ్రులు ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. పిల్లమైన మేము కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవారమని.. పునీత్ అన్నా అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచేవాడని ప్రభు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, పునీత్ ఇంటి సెక్యూరిటీ గార్డ్ రామచంద్రప్ప పునీత్ తమకి దేవుడితో సమానమని.. తన కోసం ఇంటికి వచ్చే అభిమానులను కసురుకోవద్దని చెప్పేవాడని.. ఎలాంటి బేషజాలం లేకుండా మమ్మల్ని కూడా అన్నా అని పిలిచే గొప్ప వ్యక్తి పునీత్ అని గుర్తుచేసుకొని విలపించాడు. పునీత్ మంచితనం గురించి ఒక్కో విషయం వెలుగులోకి వచ్చేకొద్దీ ఆయన అభిమానులు మరింతగా కుమిలిపోతున్నారు.