Puneeth Rajukumar: డబ్బింగ్ లేకుండానే పునీత్ చివరి సినిమా విడుదల!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ దక్షణాది సినీపరిశ్రమను కలచివేసింది సంగతి తెల్సిందే. ముఖ్యంగా కన్నడనాట ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడ సినీ..

Puneeth Rajukumar: డబ్బింగ్ లేకుండానే పునీత్ చివరి సినిమా విడుదల!

Puneeth Rajukumar

Updated On : November 1, 2021 / 3:14 PM IST

Puneeth Rajukumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ దక్షణాది సినీపరిశ్రమను కలచివేసింది సంగతి తెల్సిందే. ముఖ్యంగా కన్నడనాట ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన సేవా కార్యక్రమాలపై కూడా డైలమా నెలకొంది. ఇక పునీత్ రాజ్‌కుమార్ నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటన్నదానిపై కూడా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పునీత్ మరణించే సమయానికి ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.

Akhanda: కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య గర్జన ఎప్పుడంటే?

అందులో ద్విత్వ, కాసేతన్ కదువులాడ సినిమాలు షూటింగ్ లో ఉండగా జేమ్స్ సినిమా షూటింగ్ పూర్తయి డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ జేమ్స్ సినిమా డబ్బింగ్ విషయంలో చిత్రబృందం కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలో పునీత్ పాత్రకి డబ్బింగ్ లేకుండానే ఒరిజినల్ వాయిస్ తోనే రిలీజ్ చేసేందుకు సిద్దమైందట. అంటే షూటింగ్ సమయంలో రికార్డ్ చేసిన పునీత్ రాజ్‌కుమార్ వాయిస్‌ని ఉపయోగించేందుకు జేమ్స్ టీమ్ ప్రయత్నిస్తుందట.

RRR Glimpse : గోండు బెబ్బులి గోళ్లు ఆ సినిమా నుండి తీసుకున్నారా?

అందుకుగానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆడియో నాణ్యతను పెంచుకోవాలని చూస్తున్న జేమ్స్ మేకర్స్.. షూటింగ్ టైంలో రికార్డ్ చేసిన పునీత్ సొంత వాయిస్ నే ఉపయోగించుకునేందుకు ఓ ముంబై కంపెనీతో కలిసి పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. కన్నడలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దక్షణాదిలో కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం ఎందరో ఎదురుచూస్తున్నారు.