Akhanda: కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య గర్జన ఎప్పుడంటే?

నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ..

Akhanda: కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య గర్జన ఎప్పుడంటే?

Akhanda

Akhanda: నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ షూటింగ్ పూర్తిచేసుకుంది. సరైన సమయం చూసి గర్జించేందుకు సిద్ధమైంది. కరోనాతో షూటింగ్ గ్యాప్ రాగా.. షూటింగ్ పూర్తయ్యాక.. విడుదల తేదీలపై కూడా చాలాకాలంగా వాయిదాలు పడుతూనే ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది సస్పెన్స్ కొనసాగుతుంది.

RRR Glimpse : గోండు బెబ్బులి గోళ్లు ఆ సినిమా నుండి తీసుకున్నారా?

అఖండ సినిమా కోసం మేకర్స్ కొత్త విడుదల తేదీని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ తొలివారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. డిసెంబర్ లో విడుదల అంటే సరిగా నెలరోజులు ఉండడంతో ప్రమోషన్ స్పీడప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వారంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్, ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

RRR Movie : సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ‘ఆర్ఆర్ఆర్’ని కొట్టేవాడు లేడు.. 10టీవీతో నిర్మాత దానయ్య

బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌ కావడంతో సినీ వర్గాలు, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నాడు.

RRR Glimpse : రికార్డుల హంటింగ్ స్టార్ట్ చేశారుగా!

ఇక, బోయపాటి అంటేనే యాక్షన్.. ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌ గా ఉంటాయట. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు సాధించడంతో అఖండపై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు చేస్తోన్న ఈ సినిమా కూడా హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించాడు. బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది.