RRR Glimpse : రికార్డుల హంటింగ్ స్టార్ట్ చేశారుగా!

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ టాలీవుడ్ నయా రికార్డ్... ఇండియాలో ఎన్నో ప్లేస్ అంటే..

RRR Glimpse : రికార్డుల హంటింగ్ స్టార్ట్ చేశారుగా!

Rrr 100 K Likes

Updated On : November 1, 2021 / 12:58 PM IST

RRR Glimpse: సోషల్ మీడియాలో రికార్డుల రచ్చ రంబోలో మొదలు పెట్టేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం. సోమవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసిన ఈ వీడియో టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 100K లైక్డ్ గ్లింప్స్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది కూడా కేవలం విడుదలైన 12 నిమిషాలలోపే కావడం విశేషం.

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

ఇప్పటికే వ్యూస్ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. తారక్, చరణ్ పర్ఫార్మెన్స్, మిగతా క్యారెక్టర్ల ఇంట్రడక్షన్.. గ్రాండ్ విజువల్స్, అబ్బురపరిచే షాట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి ‘ఆర్ఆర్ఆర్’ ఎలా ఉండబోతుందో అనేది ఆడియన్స్ ఊహకే వదిలేస్తూ అంచనాలను తీసుకెళ్లి ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టాయి.

RRR Glimpse : అసలు కథ ముందుంది..

ఇండియాలో టాప్ 100 K లైక్డ్ గ్లింప్స్ ఇవే..
తల అజిత్ కుమార్ ‘వలిమై’ – 10 నిమిషాలు
‘ఆర్ఆర్ఆర్’ – 12 నిమిషాలు
‘భీమ్లా నాయక్’ – 17 నిమిషాలు
‘రాధే శ్యామ్’ – 23 నిమిషాలు
‘ఆర్ఆర్ఆర్’ ముందు ముందు ఇంకెన్ని రేర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.