RRR Glimpse : అసలు కథ ముందుంది..

45 సెకన్ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

RRR Glimpse : అసలు కథ ముందుంది..

Rrr Movie Glimpse

Updated On : November 1, 2021 / 12:27 PM IST

RRR Glimpse: గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌లు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)..

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

సోమవారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 45 సెకన్ల నిడివిగల ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ రావడం ఖాయం. మెయిన్ క్యారెక్టర్లన్నిటినీ ఈ వీడియోలో చూపించారు. ఇది కేవలం క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే.. అసలు కథ ముందుంది.. అనేలా గ్లింప్స్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్‌తో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్‌తోనే ఎండ్ అయ్యిందీ గ్లింప్స్.

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

ముఖ్యంగా తారక్ – చరణ్‌ల ట్రాన్స్ఫర్మేషన్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదీ మా తెలుగు సినిమా సత్తా అని మరోసారి ప్రపంచానికి దిక్కులు పిక్కటిల్లేలా రాజమౌళి చెప్పబోతున్నారను అనిపించేలా ఒక అద్భుతమైన విజువల్ వండర్‌లా ‘ఆర్ఆర్ఆర్’ ఉండబోతుందనిపించేలా అదిరిపోయింది గ్లింప్స్.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.

Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..

ఇద్దరు హీరోల అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు, మూవీ లవర్స్‌కి అలాగే ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌గా ఈ సినిమా ఉంటుందనిపించేలా చాలా అంటే చాలా గ్రాండియర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సీజీ, విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా సెన్సార్‌కు వెళ్లనుంది. 2022 జనవరి 7న వరల్డ్‌వైడ్‌గా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానుంది.