RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ - రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి సాలిడ్ ప్లేస్ సెట్ చేశారు..

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

Rrr Pre Release Evetn

Updated On : October 26, 2021 / 1:54 PM IST

RRR Pre- Release Event: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ నటించారు.

Kajal Aggarwal : ఇదీ కాజల్ క్రేజ్

అలియా భట్, ఒలీవియా మోరిస్‌హీరోయిన్స్ కాగా అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది ‘ఆర్ఆర్ఆర్’. 2:45 గంటల నిడివితో ఫైనల్ కట్ ప్రిపేర్ చేశారు జక్కన్న.

Sarkaru Vaari Paata : ముద్దుగుమ్మల మధ్య మహేష్

పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కావడంతో భారీ స్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. దీపావళి కానుకగా నవంబర్ ఫస్ట్ వీక్‌లో టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని దుబాయ్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చెయ్యబోతున్నారని ఫిలింనగర్ టాక్.

Student No 1 Movie : ‘RRR దోస్తీ’ గురించి రాజమౌళి 20 ఏళ్ల క్రితమే చెప్పాడా!