Sarkaru Vaari Paata : ముద్దుగుమ్మల మధ్య మహేష్

స్పెయిన్‌లో ముద్దుగుమ్మలతో సూపర్‌స్టార్ సందడి..

Sarkaru Vaari Paata : ముద్దుగుమ్మల మధ్య మహేష్

Mahesh

Updated On : October 26, 2021 / 12:39 PM IST

Sarkaru Vaari Paata: ముద్దుగుమ్మల మధ్యలో సిగ్గులొలికిస్తూ మెరుస్తూ మురిసిపోతున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. మహేష్, పరశురామ్ (బుజ్జి) కాంబి‌నేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. కీర్తి సురేష్ కథానాయిక. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Kajal Aggarwal : ఇదీ కాజల్ క్రేజ్

ప్రస్తుతం స్పెయిన్‌లో సాంగ్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే మ్యూజిక్ కంపోజిషన్ కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సూపర్ స్టార్‌తో తీసుకున్న పిక్ షేర్ చేశాడు తమన్. అలాగే ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో తెలిపేలా ఓ చిన్న వీడియా కూడా వదిలాడు.

Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు

కట్ చేస్తే ఇప్పుడు స్పెయిన్‌లో సాంగ్ షూట్ పూర్తయినట్లు లొకేషన్ పిక్స్ షేర్ చేశారు. డ్యాన్సర్స్ మధ్యలో మహేష్ మరింత గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. మహేష్ భార్య నమ్రత, కీర్తి సురేష్ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ‘సర్కారు వారి పాట’ విడుదల కానుంది.

Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్