RRR Movie : సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ‘ఆర్ఆర్ఆర్’ని కొట్టేవాడు లేడు.. 10టీవీతో నిర్మాత దానయ్య

ఒక్క 45 సెకన్ల వీడియోనే ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇవాళ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య 10టీవీతో మాట్లాడుతూ..

RRR Movie : సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ‘ఆర్ఆర్ఆర్’ని కొట్టేవాడు లేడు.. 10టీవీతో నిర్మాత దానయ్య

Danayya (1)

RRR Movie :  రాజమౌళి నుంచి ‘బాహుబలి’ తర్వాత వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ గా రాబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కరోనా వల్ల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు చిత్ర బృందం. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Diwali Movies : దీపావళి కానుకగా థియేటర్ లో/ ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే

తాజాగా ఇవాళ ఉదయం ఈ సినిమా నుంచి 45 సెకెన్ల గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ వీడియో అంచనాలకి మించి ఉంది. ఈ వీడియోలో సీన్స్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. ఒక్క 45 సెకన్ల వీడియోనే ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇవాళ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య 10టీవీతో మాట్లాడారు.

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బర్త్ డే స్పెషల్..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ఈ గ్లింప్స్ కి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. యూట్యూబ్ లో పెట్టిన కొన్ని నిమిషాలకే ట్రెండ్ లో ఉంది. జనాల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుందని మేము ముందే ఊహించాము అని అన్నారు. చాలా మంది ఫోన్ చేసి ఈ వీడియో బాగుందని చెప్తున్నారని అన్నారు. ఇది శాంపిల్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్ వరకు అని తెలిపారు. ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ప్రమోషన్స్ కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తాము. మెగా, నందమూరి ఫ్యాన్స్ కి ఇది మంచి ట్రీట్ అని అన్నారు.

Puneeth Rajkumar : పెళ్లి మండపంలో పునీత్ కి నివాళులు అర్పించిన కొత్తజంట

సంక్రాంతికి ఇంకా మూడు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి మరి వాటి ఎఫెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ మీద పడుతుందా లేక ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ వాటి మీద పడుతుందా అని అడగగా.. జనాలు అన్ని సినిమాలు చూస్తారు. సంక్రాంతికి ప్రతి సారి మూడు నాలుగు సినిమాలు కచ్చితంగా ఉంటాయి అన్ని సినిమాలు ఆడతాయి, అన్ని సినిమాలు బాగుంటాయి అన్నారు. ఎన్ని సినిమాలు వచ్చినా మమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరు. మా సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. మిగిలిన సినిమాలు కూడా ఆడతాయని అన్నారు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి మించి కచ్చితంగా అత్యధిక వసూళ్లు వస్తాయి అన్నారు. జనవరి 7న సినిమా కన్ఫర్మ్ రిలీజ్ అవుతుంది అనిమరోసారి తెలిపారు. అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.