Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బర్త్ డే స్పెషల్..

ప్రపంచ అందగత్తెల్లో తనది సుస్థిర స్థానం. తన సినిమాలతో అలరించి ఎంతో మంది కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన అందాల తార ఐశ్వర్యరాయ్. ఇవాళ అంటే నవంబర్ 1న తన పుట్టిన రోజు

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బర్త్ డే స్పెషల్..

Aishwarya

Updated On : November 1, 2021 / 11:58 AM IST

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ ని చూస్తే ‘నీలో వలపు అణువులే ఎన్నని..’ అని అడగాలనిపిస్తుంది. ‘పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం..’ అని పాడాలనిపిస్తుంది. తనని చూస్తే ‘ప్రియా ప్రియా చంపొద్దే..’ అని చెప్పాలనిపిస్తుంది. ‘పలికే గోరింకా చూడవే నా వంక..’ అంటూ తననే చూడాలనిపిస్తుంది. తన కళ్ళు మనల్ని కంటి రెప్ప వేయనియ్యవు. తన నవ్వు రోబోలకి సైతం ఫీలింగ్స్ ని తెప్పిస్తుంది. ప్రపంచ అందగత్తెల్లో తనది సుస్థిర స్థానం. తన సినిమాలతో అలరించి ఎంతో మంది కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన అందాల తార ఐశ్వర్యరాయ్. ఇవాళ అంటే నవంబర్ 1న తన పుట్టిన రోజు. 47 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికే వన్నె తరగని అందం తన సొంతం. ఐశ్వర్యరాయ్ పుట్టిన రోజున తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం…

Puneeth Rajkumar : పెళ్లి మండపంలో పునీత్ కి నివాళులు అర్పించిన కొత్తజంట

ఐశ్వర్యరాయ్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు.

ఐశ్వర్యరాయ్ డాక్టర్ స్టడీని మధ్యలోనే ఆపేసింది.

కాలేజీలో చదువుతున్నప్పుడు మోడలింగ్‌పై మనసు మళ్లింది. చిన్న చిన్న ప్రకటనల్లో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ నటించిన ‘పెప్సీ’ యాడ్‌ మంచి పేరు తీసుకురావడంతో వైద్య విద్య నుంచి మోడలింగ్‌ వైపు వెళ్ళిపోయింది. అమిర్ ఖాన్ తో ఈ పెప్సీ యాడ్ చేసింది.

1994లో ‘మిస్‌ వర్డల్‌’ కిరీటాన్ని సొంతం చేసుకుంది ఐశ్వర్య.

మిస్ వరల్డ్ కిరీటం గెలిచాక ఐష్‌కి సినిమా అవకాశాలు వచ్చాయి.

1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్‌’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసింది. ఆ సినిమా భారీ విజయం సాధించింది.

ఇప్పటి వరకు ఐష్ దాదాపు 50 సినిమాల్లో నటించింది.

1942లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘కాసాబ్లాంకా’ అంటే ఐష్‌కి చాలా ఇష్టం. తన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ సినిమా అదే. ఒక వేళ బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే కచ్చితంగా తను నటిస్తానని తెలిపింది ఐష్.

ఐష్‌కి వాచ్‌లంటే ఎంతో ఇష్టం. కొత్తగా వచ్చిన మోడల్‌ వాచ్‌లన్నింటినీ సేకరించడం ఆమె హాబీ. ఐశ్వర్యరాయ్ దగ్గర చాలా వాచ్ లు ఉన్నాయి.

ఐశ్వర్యకు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఎక్కువే. ఈమె నటించిన ‘జోధా అక్బర్‌’ చిత్రంలో ఆమె క్యారెక్టర్ కి తగ్గట్టు బార్బీ బొమ్మలను తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి.

Pawan Kalyan : మరోసారి అభిమానులపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్‌ గార్డెన్‌లో ఉన్న తులిప్‌ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్‌ పేరు పెట్టారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఐష్ వీరాభిమాని. ఎప్పటికైనా ఆయనతో నటించాలని తనకు కోరిక ఉండేది. ఆ కోరిక ‘రోబో’ చిత్రంతో నెరవేరింది.

ఐష్‌కి క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో బ్యాటు పట్టుకుని సరదాగా ఆడుతుంటారు.

అలాగే ఐశ్వర్యరాయ్ పుస్తకాల పురుగు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటారు.

2003లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా ఐష్‌ వ్యవహరించారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయు నటి.

2009లో ఐశ్వర్యరాయ్ ని భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ అవార్డుతో సత్కరించింది.

2012లో ఆమెకు బ్రిటన్‌ ప్రభుత్వం ‘ఆడ్రె డెస్‌ ఆర్ట్స్‌ ఎట్‌ డెస్‌ లెట్రెస్‌’ పురస్కారాన్ని అందించింది.

2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల వివాహం జరిగింది. వీరికి ఇప్పుడు ఆరాధ్య అనే కూతురు ఉంది.

ప్రస్తుతం ఐశ్వర్యరాయ్‌ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది.

ఇవన్నీ కాక సినిమాల పరంగా లెక్కలేనన్ని నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది ఐశ్వర్యరాయ్.

నిర్మాతగా కూడా కొన్ని సినిమాలని నిర్మించింది ఐశ్వర్య.

ఐశ్వర్య కోకాకోలా, పెప్సీ, లక్స్.. లాంటి ఎన్నో భారీ కమర్షియల్ ప్రకటనల్లో కూడా నటించింది.

Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాని చిన్న చిన్న సెట్స్ లో తీశారు.. ఎందుకని అడిగితే..