Puneeth Rajkumar : పెళ్లి మండపంలో పునీత్ కి నివాళులు అర్పించిన కొత్తజంట
వాళ్లందరిలోను వివాహం జరిగింది అనే సంతోషం కంటే పునీత్ మరణమే అందర్లోనూ బాధని నింపింది. దీంతో కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

Puneeth
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అందర్నీ కలవర పరిచింది. దేశమంతటా అయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకలో అయితే ఇంకా విషాద ఛాయల నుంచి ప్రజలు బయటకి రావట్లేదు. కర్ణాటక ప్రజలు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది పునీత్ మరణం తట్టుకోకలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కొంతమంది పునీత్ మరణ వార్త విని గుండెపోటుతో మరణించారు. గత మూడు రోజులుగా కర్ణాటక ప్రజలు శోకసంద్రంలోనే ఉన్నారు.
Pawan Kalyan : మరోసారి అభిమానులపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్
ఇలాంటి సమయంలో మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఓ వివాహం జరిగింది. అయితే అక్కడకి వచ్చిన వాళ్లందరిలోను వివాహం జరిగింది అనే సంతోషం కంటే పునీత్ మరణమే అందర్లోనూ బాధని నింపింది. దీంతో కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. పెళ్లి కార్యక్రమం ముగిశాక పెళ్లి మండపంలో పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అంతే కాక కొత్త జంటతో పాటు పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా క్యాండిల్స్ వెలిగించి పునీత్ కి నివాళులు అర్పించారు. నూతన జంటని ఆశీర్వదించడానికి వచ్చిన అతిధులు పునీత్‌కు శ్రద్దాంజలి కూడా ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధ స్పష్టంగా కనిపించింది.