Diwali Movies : దీపావళి కానుకగా థియేటర్ లో/ ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నటించిన సినిమా 'అన్నాత్తే'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ అవ్వనుంది. హీరో విశాల్ నటించిన 'ఎనిమి' సినిమా కూడా దీపావళి

Diwali Movies : దీపావళి కానుకగా థియేటర్ లో/ ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే

Diwali Movies (1)

Updated On : November 1, 2021 / 12:27 PM IST

Diwali Movies :  కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు బాగానే రిలీజ్ అవుతున్నాయి. ఒక పక్క ఓటిటిలో, మరో పక్క థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయి మంచి విజయాలు సాధిస్తున్నాయి. కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.మాములు టైంలోనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అభిమానులు, ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పండగల టైంలో సినిమాలు అంటే ఆ హడావిడి వేరేగా ఉంటది. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు పండగలకి రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర అభిమానుల రచ్చ మాములుగా ఉండదు. ఇంకో మూడు రోజుల్లో దీపావళి ఉంది. ఈ దీపావళికి కూడా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని ఓటిటిలో కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బర్త్ డే స్పెషల్..

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నటించిన సినిమా ‘అన్నాత్తే’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ అవ్వనుంది. హీరో విశాల్ నటించిన ‘ఎనిమి’ సినిమా కూడా దీపావళి రోజే రానుంది. యువ హీరో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’ కూడా దీపావళి కానుకగా 4వ తేదీన విడుదల కాబోతుంది. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘సూర్యవంశీ’ నవంబర్ 5న విడుదల కాబోతుంది. ఇక హాలీవుడ్ నుంచి మార్వెల్ ‘ఇటర్నల్స్’ నవంబర్ 5న థియేటర్లలో రానుంది.

Puneeth Rajkumar : పెళ్లి మండపంలో పునీత్ కి నివాళులు అర్పించిన కొత్తజంట

సూర్య హీరోగా నటించిన ‘జై భీం’ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల కానుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’ సినిమా నవంబర్ 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ నవంబర్ 4 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇవే కాక నెట్ ఫ్లిక్స్ లో ద వెడ్డింగ్‌ గెస్ట్‌, ద హార్డర్‌ దే ఫాల్‌, ద అన్‌లైక్లీ మర్డరర్‌, లవ్‌ హార్డ్‌ లాంటి మరిన్ని హాలీవుడ్ సినిమాలు ఈ వారంలో రిలీజ్ అవ్వనున్నాయి.