Virat Kohli: ఏప్రిల్ 23.. విరాట్ కోహ్లికి అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు.. మూడుసార్లు ఈరోజే గోల్డెన్ డ‌కౌట్‌

ఏప్రిల్ 23 మాత్రం కోహ్లికి అస్స‌లు కలిసిరావ‌డం లేదు. మూడో సారి ఏప్రిల్ 23న కోహ్లి గోల్డెన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

Virat Kohli: ఏప్రిల్ 23.. విరాట్ కోహ్లికి అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు.. మూడుసార్లు ఈరోజే గోల్డెన్ డ‌కౌట్‌

Virat Kohli Golden ducks (pic ipl twitter)

Virat Kohli: విరాట్ కోహ్లి బ్యాట్ చేత బ‌ట్టి మైదానంలో అడుగుపెడితే రికార్డులు అన్ని అత‌డికి దాసోహం అనాల్సిందే. అయితే మిగ‌తా రోజుల సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికి నేడు అంటే ఏప్రిల్ 23 మాత్రం కోహ్లికి అస్స‌లు కలిసిరావ‌డం లేదు. ఐపీఎల్ ఆరంభ‌మైన‌ప్ప‌టికి నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ నేడు(ఏప్రిల్ 23న‌) మ‌రోసారి గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు.

చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొద‌టి బంతికే విరాట్ కోహ్లి ఎల్భీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో మూడో సారి ఏప్రిల్ 23న కోహ్లి గోల్డెన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 7వ గోల్డెన్ డ‌కౌట్ కాగా 10 సార్లు విరాట్ ప‌రుగులు చేయ‌కుండానే ఔట్ అయ్యాడు.

IPL 2023, RCB vs RR: శాంస‌న్ ఔట్‌.. రాజ‌స్థాన్ ఫోర్ డౌన్‌..Live Updates

గ‌తంలో రెండు సంద‌ర్భాల్లో (ఏప్రిల్ 23న విరాట్ గోల్డెన్ డ‌కౌట్ అయిన స‌మ‌యంలో) బెంగ‌ళూరు జ‌ట్టు ఓడిపోయింది. 2017లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన కోహ్లి.. నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ బౌలింగ్‌లో మ‌నీశ్ పాండే క్యాచ్ అందుకోవ‌డంతో తొలి బంతికే గోల్డెన్ డ‌క్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా 82 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్ క్యాచ్ అందుకోవ‌డంతో కోహ్లి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బెంగ‌ళూరు ఓడిపోయింది. ఇక నేడు రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో కూడా కోహ్లి డ‌కౌట్ అయ్యాడు. మ‌రీ ఆర్‌సీబీ మ్యాచ్ ఫ‌లితం ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

IPL 2023: కోహ్లీతో పాటు ఆర్సీబీ ప్లేయర్లు అందరూ రెడ్ జెర్సీ ధరించకుండా గ్రీన్ జెర్సీతో ఎందుకు ఆడారో తెలుసా?