Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

కోవిడ్ ఎఫెక్ట్ తో ఆడియెన్స్ లేక వెలవెల బోయిన ధియేటర్లు.. ఇప్పుడు వరస సినిమాల రిలీజ్ లతో సందడి చేస్తున్నాయి. బిగ్ బ్రేక్ తర్వాత వస్తోన్న బిగ్ స్టార్స్ మూవీస్ తో ఫెస్టివల్ లుక్..

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

Movie Releases

Movie Releases: కోవిడ్ ఎఫెక్ట్ తో ఆడియెన్స్ లేక వెలవెల బోయిన ధియేటర్లు.. ఇప్పుడు వరస సినిమాల రిలీజ్ లతో సందడి చేస్తున్నాయి. బిగ్ బ్రేక్ తర్వాత వస్తోన్న బిగ్ స్టార్స్ మూవీస్ తో ఫెస్టివల్ లుక్ తీసుకొస్తున్నాయి. ఓ రకంగా ఛాన్నాళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ కళకళలాడుతోంది. 2022లో పవన్, ప్రభాస్ తర్వాత మరికొంతమంది మేము రెడీ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

మొన్నటివరకు రిలీజ్ లు లేక ఖాళీగా ఉన్న థియేటర్స్.. రిలీజ్ లు ఆపుకొని ఎదురుచూసిన స్టార్లు.. ఇప్పుడు అటు థియేటర్స్ లో.. ఇటు స్టార్స్ మొహంలో.. ఎటు చూసినా ఫుల్ జోష్ కనిపిస్తోంది. 2022లో ఫస్ట్ టాలీవుడ్ కి బూస్టప్ నిచ్చింది భీమ్లానాయక్. పవర్ ఫుల్ స్టామినాతో థియేటర్స్ కి జనాలను రప్పించిన పవర్ స్టార్.. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దుమ్ముదులిపేసాడు. భీమ్లా తర్వాత ప్రస్తుతం ఆ మేనియాను రాధేశ్యామ్ కొనసాగిస్తోంది. సినిమా ఎలా ఉన్నా ఈ వీకెండ్ ఆడియెన్స్ మాత్రం రాధేశ్యామ్ కే ఓటేస్తున్నారు.

Movie Releases: క్రేజీ మూవీస్.. గురువారం నుండే సినిమా పండగ!

రాధేశ్యామ్ తర్వాత వెంటనే భారీ హైప్ తో రాబోతుంది ట్రిపుల్ ఆర్. మార్చి 25న రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ ప్రమోషన్ల కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్స్ తో రెడీగా ఉంది. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ట్రిపుల్ఆర్ కోసం ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. తారక్ తో సినిమా చూపించిన నెల గ్యాప్ తో తండ్రి చిరూతో కలిసి ఆచార్యను చూపించబోతున్నాడు చరణ్. ఏప్రిల్ 29న కొరటాల ఆచార్య థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

భీమ్లానాయక్, రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్, ఆచార్య.. ఆ తర్వాత సూపర్ స్టార్ సర్కారు వారి పాట. మే 12న మహేశ్, పరశురామ్ కాంబో మూవీ ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టిన మహేశ్ సినిమా కోసం ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. థియేటర్స్ లో పండగ చేసుకోవాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.