Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

మొన్నటి వరకూ జనాలు లేక వెలవెల బోయిన ధియేటర్లు.. ఇప్పుడు వరస సినిమాల రిలీజ్ లతో కళకళలాడుతున్నాయి. రెండేళ్ల నుంచి రిలీజ్ లు లేక ఖాళీగా ఉన్న స్టార్లు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్..

Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

Rrr Radhe Shyam

Movie Releases: మొన్నటి వరకూ జనాలు లేక వెలవెల బోయిన ధియేటర్లు.. ఇప్పుడు వరస సినిమాల రిలీజ్ లతో కళకళలాడుతున్నాయి. రెండేళ్ల నుంచి రిలీజ్ లు లేక ఖాళీగా ఉన్న స్టార్లు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్లతో సందడి చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా అటు ఇండస్ట్రీలో ఇటు ఆడియన్స్ లో సినిమాయే హాట్ టాపిక్ అవుతోంది.

RRR: ప్రమోషన్ క్రేజ్.. మళ్ళీ రాబోతున్న రాముడు-భీముడు

టాలీవుడ్ లైన్లోకొచ్చింది. రెండేళ్ల నుంచి సినిమా సందడి లేక కామ్ అయిపోయిన ఇండస్ట్రీ ఇపుడు వరసగా రిలీజ్ లతో, ప్రమోషన్లతో కళకళలాడుతోంది. ఈ సంవత్సరం సినిమాల పరిస్తితి ఎలా ఉంటుందో అని డౌట్ పడిన ఆడియన్స్ కి, స్టార్స్ కి మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది భీమ్లనాయక్.

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. రికార్డ్ బుకింగ్స్!

భీమ్లానాయక్ ప్రమోషన్లకు పెద్దగా టైమ్ లేకపోయినా.. ఉన్న షార్ట్ టైమ్ లోనే సినిమాకు కావల్సినంత హైప్ తీసుకొచ్చారు. జస్ట్ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. ఈ లిమిటెడ్ ప్రమోషన్లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన భీమ్లా నాయక్ బూస్టప్ ఇవ్వడంతో వరసపెట్టి రిలీజ్ లు, సినిమా ఈవెంట్లు, స్టార్ల ప్రమోషన్లతో సందడి చేస్తున్నాయి రిలీజ్ కు రెడీ గా ఉన్న మిగతా సినిమాలు.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ నుండి మరో ట్రైలర్?

భీమ్లానాయక్ నుంచి స్టార్టయిన సినిమా పండగ రాధేశ్యామ్ తో పీక్స్ కి చేరబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా రాధేశ్యామ్ సందడే కనిపిస్తోంది. ఎటు చూసినా ప్రభాస్, పూజాహెగ్డేనే కనిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా మార్చి 11న రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్లు నార్త్ టూ సౌత్ నాన్ స్టాప్ గా చేస్తున్నారు టీమ్. ఆల్రెడీ ముంబై ప్రమోషన్లతో పాటు చెన్నై కూడా చుట్టేసిన టీమ్.. మిగతా ఏరియాస్ ని కవర్ చేసే పనిలో ఉన్నారు.

Radhe Shyam: రా.. రా.. రాధేశ్యామ్.. ఇక కొన్ని గంటలే మిగిలింది!

జనవరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సందడిచేసిన రాదేశ్యామ్ టీమ్.. ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ కాకుండా వరసపెట్టి ప్రెస్ మీట్లతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నారు. ప్రభాస్ మూడేళ్ల నుంచి సినిమా రిలీజ్ చెయ్యకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కోసం గట్టిగానే ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఉన్న పూజాహెగ్డే.. పాన్ ఇండియా స్టార్ తో మరో హిట్ ని అకౌంట్ లో వేసుకుంటానంటోంది.

Radhe Shyam: డార్లింగ్ కష్టాలు.. రాధేశ్యామ్ వెనక జరిగిందేంటి?

ఇప్పటికే పీక్స్ లో ప్రమోషన్లు చేస్తున్న రాదేశ్యామ్ రిలీజ్ అవ్వగానే.. ట్రిపుల్ఆర్ ప్రమోషన్లకు రెడీ అవుతోంది. మార్చి 25న రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ ప్రమోషన్ల కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ గా ఉంది. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ట్రిపుల్ఆర్ కోసం ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అందుకే ఇదే రేంజ్ లో తమకున్న క్రేజ్ ని కంటిన్యూ చెయ్యడానికి మరోసారి ప్రమోషన్లకు రెడీ అవుతోంది ట్రిపుల్ఆర్.

Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కిన ట్రిపుల్ఆర్ కిఆల్రెడీ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేసేశారు. అయితే లాస్ట్ మినిట్ లో సినమా పోస్ట్ పోన్ అవ్వడంతో రెండు నెలలు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది ట్రిపుల్ ఆర్ కి. అలా అని కామ్ గా ఉండలేదు జక్కన్న. ఎప్పటికప్పుడు ఇంట్రస్టింగ్ ఇన్ ఫర్మేషన్ తో పాటు క్రేజీ ఫోటోల్ని షేర్ చేస్తూ.. సినిమాని హాట్ టాపిక్ చేస్తూనే ఉన్నారు. మరో రెండు వారాల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ట్రిపుల్ ఆర్ మరోసారి ఇదే రేంజ్ ప్రమోషన్లతో సందడి చెయ్యబోతోంది.