RRR: ప్రమోషన్ క్రేజ్.. మళ్ళీ రాబోతున్న రాముడు-భీముడు

వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ హడావిడి రోజు రోజుకీ పెరుగుతోంది.

RRR: ప్రమోషన్ క్రేజ్.. మళ్ళీ రాబోతున్న రాముడు-భీముడు

RRR

RRR: వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ హడావిడి రోజు రోజుకీ పెరుగుతోంది. వాయిదాల మీద వాయిదాల తర్వాత వస్తోన్న సినిమా అయినా ప్రేక్షకుల అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. దీనికి కారణం లార్జ్ స్కేల్ డైరెక్టర్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ కావడమే. అందుకే అదే లెవెల్ లో మళ్లీ ప్రమోషన్స్ కోసం భారీ ప్లానింగ్ తో రెడీ అవుతున్నారు మేకర్స్.

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. రికార్డ్ బుకింగ్స్!

తారక్, రామ్ చరణ్, రాజమౌళి అభిమానులకు కౌంట్ డౌన్ స్టార్టయింది. నాలుగు సంవత్సరాల సినిమా, మూడు సంవత్సరాల మేకింగ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ అతిత్వరలో థియేటర్స్ కి రాబోతుంది. ఈ క్రమంలో రాజమౌళి నుంచి వచ్చే కొత్త అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫాన్స్. రాజమౌళి సినిమాను ఎంత గ్రాండ్ గా తెరకెక్కిస్తారో ప్రమోషన్ విషయంలోనూ అంతే తెలివిగా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. రాధేశ్యామ్ హడావిడి తగ్గిన వెంటనే ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతుంది. పనిలో పనిగా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో ట్రిపుల్ ఆర్ ని కూడా ప్రమోట్ చేశారు రాజమౌళి.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ నుండి మరో ట్రైలర్?

ట్రిపుల్ ఆర్ టీమ్ రీ ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది. మార్చి 20న బెంగుళూరులో లార్జ్ స్కేల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసింది. దీంతో పాటూ మరికొన్ని ఈవెంట్స్ కూడా మేకర్స్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రస్తుతం పివిఆర్ థియేటర్స్ లో రవ్ అవుతోన్న సినిమాల షోకు ముందే ట్రిపుల్ ఆర్ కౌంట్ డౌన్ టీజర్ పడుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో లాగానే సౌత్ టు నార్త్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకోబోతున్నాయి. మళ్లీ ఓసారి ట్రిపుల్ ఆర్ టీమ్ ను బాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి కరణ్ జోహార్ లాంటి వారు కూడా వెయిట్ చేస్తున్నారు.