RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. రికార్డ్ బుకింగ్స్!

ఇప్పుడు జాతీయ స్థాయిలో కాదు కాదు ఇండియన్స్ ఉన్న అన్ని దేశాలలో అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. రాజమౌళి మరో విజువల్ వండర్ గా తెరెకక్కుతున్న ఆర్ఆర్ఆర్..

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. రికార్డ్ బుకింగ్స్!

Rrr

RRR: ఇప్పుడు జాతీయ స్థాయిలో కాదు కాదు ఇండియన్స్ ఉన్న అన్ని దేశాలలో అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. రాజమౌళి మరో విజువల్ వండర్ గా తెరెకక్కుతున్న ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే అడుగుపెట్టిన ప్రతి చోట రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. గతంలో జనవరిలో విడుదల సందర్భంగా అమెరికాలో ముందే బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బుకింగ్స్ చేసుకుంది. దీనిపై మేకర్స్ అప్పుడు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్లు కూడా చేశారు.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ నుండి మరో ట్రైలర్?

అయితే, అనూహ్యంగా అప్పుడు సినిమా వాయిదా పడింది. బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ బుకింగ్స్ రీఫండ్ చేశారు. కాగా.. ఇప్పుడు మరోసారి విడుదలకి సిద్ధమవుతుండగా.. ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్థాయిలో అమెరికాలో బుకింగ్స్ మొదలయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజున సమయం ఉండగానే అమెరికాలో ప్రీమియం షోల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడం.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టించడం కూడా జరిగిపోయింది. అమెరికా అంతటా ప్రధాన సినిమా చైన్ లు ముందస్తు బుకింగ్ లను తెరవగా.. ఇప్పటికే అమెరికాలో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను సృష్టించింది.

RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?

ఇందుకు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక ట్వీట్ చేసింది. గతంలో మా సినిమా ఆగిన సమయంలో టికెట్స్ బుక్ చేసిన ఓవర్సీస్ ఆడియెన్స్ అందరికీ గాను వారి డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగిందని.. మళ్ళీ ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేసినా వారంతా మళ్ళీ అంతే ప్రేమను మా సినిమాపై కనబరుస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ 25న థియేటర్స్ లో అసలైన భారీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మీకోసం ఎదురు చూస్తుందని తెలిపారు. సినిమా విడుదలకు ఇరవై రోజున ముందే, రెండో సారి కూడా భారీ బుకింగ్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

RRR: మరో రికార్డ్.. లండన్ బీఎఫ్‌ఐ ఐమాక్స్ స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్?

ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ రాకపోగా ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు ముందే ఈ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టగా మున్ముందు ఇంకెన్ని రికార్డులని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా.. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్లతో డివివి దానయ్య నిర్మించారు.