Radhe Shyam: డార్లింగ్ కష్టాలు.. రాధేశ్యామ్ వెనక జరిగిందేంటి?

ప్రభాస్, పూజాహగ్డే జంటగా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా తెరకెక్కి ఈ వారంలో రిలీజ్ కి రెడీ అవుతున్న రాధేశ్యామ్ కి అసలు ఆ టైటిల్ ఎవరు పెట్టారు..? రాధేశ్యామ్ లో ప్రభాస్ కి బాగా..

Radhe Shyam: డార్లింగ్ కష్టాలు.. రాధేశ్యామ్ వెనక జరిగిందేంటి?

Radhe Shyam

Radhe Shyam: ప్రభాస్, పూజాహగ్డే జంటగా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా తెరకెక్కి ఈ వారంలో రిలీజ్ కి రెడీ అవుతున్న రాధేశ్యామ్ కి అసలు ఆ టైటిల్ ఎవరు పెట్టారు..? రాధేశ్యామ్ లో ప్రభాస్ కి బాగా ఇష్టమైన పాట ఏంటి..? బాగా కష్టమైనసీన్ ఏంటి..? అసలు ప్రభాస్ పెళ్లెప్పుడు..? క్లైమాక్స్ గురించి ప్రభాస్ రివీల్ చేసిన ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఏంటి?. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరసగా యాక్షన్ మూవీస్ చేస్తూ.. వాటికి బ్రేక్ ఇచ్చి మరోసారి లవర్ బాయ్ గా కనిపిస్తున్న మూవీ రాధేశ్యామ్. ప్రేమకు ప్రతిరూపమైన రాధ,కృష్ణుల పేరునే తమ సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసింది టీమ్.

Radhe Shyam: ప్రమోషన్ ఎంగేజ్మెంట్.. సందడంతా పూజా-ప్రభాస్‌దే!

అయితే అసలు రాధేశ్యామ్ అన్న పేరును ప్రపోజ్ చేసింది.. దాన్ని ఫిక్స్ చేసిన క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కే ఇచ్చారు ప్రభాస్. రాధేశ్యామ్ రిలీజ్ కోసం 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫాన్స్. 300కోట్ల బడ్జెట్.. భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ సెట్టింగ్స్ ఇలా ప్రతీదీ నెక్ట్స్ లెవల్ లో ఉన్న ఈ సినిమా ఏ తెలుగు సినిమాకీ లేనన్ని ఓపెనింగ్స్ తో రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ లో అయితే వేల ధియేటర్లతో రికార్డ్ రేంజ్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. మిర్చి తర్వాత రాధేశ్యామ్ లో మళ్లీ అలాంటి ఫీల్ గుడ్ లవ్ యాంగిల్ కనిపిస్తోంది ప్రభాస్ లో. ఈ కంప్లీట్ లవ్ స్టోరీలో సాంగ్స్ ఆ ఫీల్ ని కంటిన్యూ చేసేలా పిక్చరైజ్ చేశారు.

Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

సినిమాలో మిగతా సాంగ్స్ ఎన్ని ఉన్నా.. ప్రభాస్ కి మాత్రం సినిమాకి మంచి ప్లేస్ మెంట్ ఇచ్చిన సిద్ శ్రీరామ్ సాంగ్ ఫేవరెట్ సాంగ్ అని చెబుతున్నారు. కంప్లీట్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే.. రెట్రో కమర్షియల్ లవ్ స్టోరీ చెయ్యడానికి చాలాకష్టపడింది. ఈ సినిమా క్యారెక్టర్ కోసం, కాస్ట్యూమ్స్ క్యారీ చెయ్యడానికి బాగా సెర్చ్ చేశానంటోంది పూజా. అంతేకాదు ఈ సినిమా కోసం మంచులో సాంగ్ షూటింగ్ చెయ్యడం బాగా కష్టమైందంటోంది ఈ స్టార్ హీరోయిన్.

Radhe Shyam: పేరుకే డార్లింగ్.. కానీ రొమాన్స్ మాత్రం కష్టం!

రాధేశ్యామ్ సినిమా మొత్తానికి హైలెట్ క్లైమాక్స్. విథికి, ప్రేమకు మధ్య సంఘర్షణలో ఏది గెలుస్తుందో అన్నది విజువల్ గా చూపించడానికి బాగా కష్టపడ్డారు టీమ్. ఈ క్లైమాక్స్ ని హైదరాబాద్ లోనే 15 రోజుల పాటు రెయిన్ ఎఫెక్ట్ తో షూట్ చేశారు. క్లైమాక్స్ షిప్ సీన్ చెయ్యడం కోసం చాలా కష్టపడ్డానంటున్నారు ప్రభాస్. బాలీవుడ్, హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో ఫైట్స్ కంపోజ్ చేయించిన టీమ్.. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఫైట్స్ చేయించారు. అడవిలో ఫైటింగ్ తో పాటు క్లైమాక్స్ లో షూటింగ్ కి బాగా టైమ్ తీసుకున్నానంటున్నారు ప్రభాస్.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. రాధేశ్యామ్ క్లైమాక్స్ రచ్చ!

ఇక బైలింగ్వల్ గా తెరకెక్కిన ఈ మూవీ కోసం రెండు భాషల్లో డైలాగ్స్ చెప్పడం, ఆ ఎమోషన్ ని క్యారీ చెయ్యడం కోసం కాస్త ఇబ్బంది పడ్డానంటోంది పూజాహెగ్డే. ఇక సినిమా అంతా సరే.. ప్రభాస్ పెళ్లెప్పుడు అంటూ అంతా హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. రాధేశ్యామ్ లో పామిస్ట్ గా ఫ్యూచర్ చెబుతున్న ప్రభాస్.. తన పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం.. పంచ్ లతో సరిపెట్టేస్తున్నారు. ఏమో, ఎప్పుడో అంటూ దాటేస్తున్నారు.