Radhe Shyam: ప్రమోషన్ ఎంగేజ్మెంట్.. సందడంతా పూజా-ప్రభాస్‌దే!

ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నారు రాధేశ్యామ్ జంట. మార్చ్ 11న రాబోతున్న రాధేశ్యామ్ తో పాటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను..

Radhe Shyam: ప్రమోషన్ ఎంగేజ్మెంట్.. సందడంతా పూజా-ప్రభాస్‌దే!

Radhe Shyam (1)

Radhe Shyam: ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నారు రాధేశ్యామ్ జంట. మార్చ్ 11న రాబోతున్న రాధేశ్యామ్ తో పాటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. లేట్ చేయకుండా వరుసగా సినిమాలు చేస్తానని గ్లోబల్ స్టార్ చెప్తుంటే.. రియల్ లైఫ్ లో లవ్ గురించి పూజా హెగ్డే ఓపెన్ అయింది. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో అంటోన్న రాధేశ్యామ్ కపుల్ ఇంకా ఏం చెప్తున్నారు.

Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

ఇలా కొత్త కొత్తగా సాంగ్స్, టీజర్స్ తో ప్రజెంట్ హడావిడీ అంతా రాధేశ్యామ్ దే. ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవబుల్ సబ్జెక్ట్ తో వస్తోన్న ఈ మూవీ మార్చ్ 11 వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు చూపిస్తున్న ప్రభాస్, పూజా హెగ్డే ఎన్నో సమ్ థింగ్ స్పెషల్ విశేషాలను ఆడియెన్స్ తో షేర్ చేస్తున్నారు. రాధేశ్యామ్ కోసం థియేటర్ కి వెళ్లేలా ఎంగేజ్ చేసేస్తున్నారు.

Radhe Shyam: పేరుకే డార్లింగ్.. కానీ రొమాన్స్ మాత్రం కష్టం!

నేషనల్ స్టార్.. అంతకుమించి అనిపించుకుంటున్నారు కానీ.. సాహో తర్వాత ప్రభాస్ థియేటర్ కొచ్చేది రాధేశ్యామ్ తోనే. ఇలా ఇన్నేసి ఏళ్లు ఫ్యాన్స్ ను వెయిట్ చేయించకుండా ఇప్పటినుంచి సినిమా సినిమాకి పెద్ద గ్యాప్ లేకుండా చూసుకోబోతున్నారు ప్రభాస్. ఒకేసారి ఆల్టర్ నేటివ్గా మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేయడం కూడా ఇప్పుడు అలవాటైందని చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే వెంటవెంటనే యంగ్ రెబల్ స్టార్ నుంచి రాబోతున్నాయి.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. రాధేశ్యామ్ క్లైమాక్స్ రచ్చ!

అన్ని భాషల్లో నటించాలనుంది కానీ తెలుగు సినిమాలకే తన ఫస్ట్ ఫ్రిఫరెన్స్ అంటోంది పూజా హెగ్డే. రాథేశ్యామ్ కోసం ఒకేసారి హిందీ, తెలుగు భాషల్లో నటించడం పూజాకి క్రేజీగా అనిపించింది. సీన్స్ ఒకటే కానీ మ్యాజిక్ వేరే లెవెల్ అన్నది బుట్టబొమ్మ వర్షన్. ఇక కొంచెం షైగా కనిపిస్తారు కానీ ప్రభాస్ చాలా ఫన్నీ అని చెప్పుకొచ్చింది పూజా. ప్రభాస్ అంటే యాక్షన్‌ స్టార్ అంటారు కానీ రాధేశ్యామ్ క్లైమాక్స్‌లో ఓ ఎమోషనల్ సీన్ లో ప్రభాస్ ఇరగదీసారని.. ఫ్యాన్స్ ఆయనలోని న్యూ యాంగిల్ చూస్తారని చెప్పి ఇంట్రెస్ట్ డబుల్ చేసేసింది.

Radhe Shyam: చల్లారని కోల్డ్ వార్.. ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా?

రియల్ లైఫ్ లో తానెవ్వరితోనూ ప్రేమలో పడలేదని.. ప్రేమకి సమయం కేటాయించాలని.. ప్రస్తుతం అది తన దగ్గర లేదని బుట్టబొమ్మ అనౌన్స్ చేసింది. అటు ఎన్నోసార్లు లవ్ ఫెయిల్యూర్ అందుకే ఇంకా పెళ్లికాలేదంటూ ప్రభాస్ ఈమధ్యే ప్రమోషన్స్ లో సందడి చేశారు. ఇలా నేషనల్ వైడ్ ప్రభాస్, పూజాల ప్రెజెంట్ గ్రేస్ పీక్స్ ను టచ్ చేస్తోంది. సినిమా సంగతులతో పాటూ పర్సనల్ ఓపీనియన్స్ ను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ వీళ్ల గురించే మాట్లాడుకునేలా చేసేస్తున్నారు.