Radhe Shyam: రా.. రా.. రాధేశ్యామ్.. ఇక కొన్ని గంటలే మిగిలింది!

ఫ్యాన్స్ రెండున్నరేళ్ల నిరీక్షణకు ఈ శుక్రవారమే తెరపడనుంది. తెరపై రాధేశ్యామ్ బొమ్మ పడేందుకు కొన్ని గంటలే మిగిలుంది. ఇంకేముంది థియేటర్స్ ముందు కటౌట్స్ తో.. థియేటర్స్ లో సినిమా..

Radhe Shyam: రా.. రా.. రాధేశ్యామ్.. ఇక కొన్ని గంటలే మిగిలింది!

Radhe Shyam

Radhe Shyam: ఫ్యాన్స్ రెండున్నరేళ్ల నిరీక్షణకు ఈ శుక్రవారమే తెరపడనుంది. తెరపై రాధేశ్యామ్ బొమ్మ పడేందుకు కొన్ని గంటలే మిగిలుంది. ఇంకేముంది థియేటర్స్ ముందు కటౌట్స్ తో.. థియేటర్స్ లో సినిమా చూసేందుకు ఆడ్వాన్స్ బుకింగ్స్ తో హోరెత్తిస్తున్నారు డార్లింగ్ అభిమానులు. సేమ్ టైమ్.. 2019లో స్టార్టయిన రాధేశ్యామ్ బిగ్గెస్ట్ ప్రమోషన్ జర్నీని మేకర్స్ షేర్ చేసుకున్నారు.

Radhe Shyam: డార్లింగ్ కష్టాలు.. రాధేశ్యామ్ వెనక జరిగిందేంటి?

మొదట్లో డల్ అనిపించినా.. ప్రెజెంట్ ప్రమోషన్స్ ను రాధేశ్యామ్ మేకర్స్ పీక్స్ కు చేర్చారు. వరుస ప్రమోషన్స్ తో స్పీడప్ పెంచి డార్లింగ్ ఫ్యాన్స్ ను రిలీజ్ కు ముందు ఫుల్ ఖుషీ చేశారు. రీసెంట్ గా ది జర్నీ ఆఫ్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ అంటూ మేకర్స్ కొత్త వీడియోని తీసుకొచ్చి.. ఈ 2019లో మొదలైన మూవీ బిగ్గెస్ట్ జర్నీ ఫైనల్ డెస్టినేషన్ రీచయిందని.. మార్చ్ 11న థియేటర్ లో సినిమా చూసి ఎపిక్ లవ్ స్టోరీని ఎక్స్ పీరియెన్స్ చేయడంటూ హైప్ తీసుకొచ్చారు.

Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

300 కోట్ల బడ్జెట్ తో ఫస్ట్ టైమ్ అత్యంత ఖరీదైన లవ్ స్టోరీగా రాబోతుంది రాధేశ్యామ్. కేవలం ఆర్ట్ డిపార్ట్ మెంట్ కే 100కోట్ల ఖర్చయిందంటే సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. కొవిడ్ ముందు, రిలాక్సేషన్ టైమ్ లో ఆన్ లోకేషన్స్.. కుదరనప్పుడు హైదరాబాద్ లోనే ఇటలీ సెట్స్.. ఇలా రియల్ లోకేషన్స్ తో పాటూ 109 సెట్స్ రాధేశ్యామ్ కోసం వేసారు. అయితే ఆడియెన్స్ ఎలాంటి ల్యాగ్ ఫీలవకుండా ఉండేందుకు కష్టపడి తీసిన కొన్ని సీన్స్ ను.. మొత్తంగా 12నిమిషాల సీన్స్ ను కత్తిరించినట్టు తెలుస్తోంది.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. రాధేశ్యామ్ క్లైమాక్స్ రచ్చ!

సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ తో అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ రెగ్యులర్ ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ బజ్ క్రియేట్ చేసాడు డైరెక్టర్ రాధాకృష్ణ. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ తో ఫ్యాన్స్ అంతగా రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ లో అయితే ఫస్ట్ రెండు, మూడు రోజులకు ఇప్పటికే థియేటర్స్ హౌజ్ ఫుల్ బోర్డ్స్ వేసేసాయి. ఓవర్సీస్ లోనూ ఇదే దూకుడు కనిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ లో సాలిడ్ గా 5లక్షల డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసిన రాధేశ్యామ్ అంతకుమించి అనిపించేలా దూసుకుపోతుంది.