Tollywood Gossips: రూమర్స్‌ను నిజం చేస్తున్న మేకర్స్..!

కొన్ని రూమర్స్ గా మాత్రమే మిగులుతాయేమో అనుకున్నవి... నిజమవుతున్నాయి. ఆ వార్తలు గాలి వార్తలు కాదంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ రీమక్స్ లో

Tollywood Gossips: రూమర్స్‌ను నిజం చేస్తున్న మేకర్స్..!

Tollywood Gossips

Tollywood Gossips: కొన్ని రూమర్స్ గా మాత్రమే మిగులుతాయేమో అనుకున్నవి… నిజమవుతున్నాయి. ఆ వార్తలు గాలి వార్తలు కాదంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ రీమక్స్ లో లూసిఫర్ రీమేక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దీనికి కారణం ఈ సినిమా కోసం మేకర్స్ సెట్ చేస్తున్న కాంబినేషన్స్. తాజాగా చిరూ గాడ్ ఫాదర్ మూవీలో నయనతార ఫిక్సయింది. శోభన దగ్గరి నుంచి రమ్యకృష్ణ వరకు ఎన్నో పేర్లు వినిపించినా… ఫస్ట్ నుంచి హెడ్ లైన్స్ లో ఉన్న నయనే చివరికి మెగా 153లో కనిపించనుంది.

Vindhya Vishaka: అందాలే ఆయుధంగా యాంకర్ వింధ్యా!

ఆమె బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ ఈ న్యూస్ రివీల్ చేసారు. సైరా నరసింహా రెడ్డిలో జోడీగా మెరిసిన మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్… గాడ్ ఫాదర్ లో అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ఉంటుందని… చిరూ, సల్మాన్ కలిసి స్టెప్పులేనే పాటని ఇంటర్నేషనల్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ లో పాడించేందుకు ట్రై చేస్తున్నామని తమన్ కన్ఫర్మ్ చేసాడు. చూస్తుంటే ఇది మామూలు రీమేక్ కాదు… అల్ట్రా రేంజ్ లో మేకోవర్ అవుతున్న రీమేక్ లా కనిపిస్తోంది.

Squid Game: తెలుగులో స్క్విడ్ గేమ్.. లెక్కకు మించి రికార్డుల టార్గెట్!

ఉప్పెనతో హ్యూజ్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటినుంచో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇది నిజంగానే నిజం కానుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం మైత్రీవారితోనే రెండో సినిమా కూడా చేయాల్సి ఉంది బుచ్చిబాబు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించబోతున్నట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు రివీల్ చేసాడు. ఆమధ్య తారక్ పుట్టినరోజున స్పెషల్ గా బాబు విష్ చేసినప్పుడే ఏదో ఉందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పటికే ఎన్.టి.ఆర్‌కు లైన్ చెప్పి ఒప్పించిన తను ప్రస్తుతం పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసే పనిలో ఉన్నాడు. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.